నరేంద్రమోదీ తొలిసారి ఆఫ్రికా ఖండంలో పర్యటిస్తున్నారు
- July 06, 2016
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం మొజాంబిక్ రాజధాని మొపుటో చేరుకున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక నరేంద్రమోదీ తొలిసారి ఆఫ్రికా ఖండంలో పర్యటిస్తున్నారు. 1982 తర్వాత భారత ప్రధాని ఇక్కడ పర్యటించడం కూడా ఇదే ప్రథమం. మొజాంబిక్ రాజధాని మొపుటోలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న ప్రధాని... సాయంత్రం దక్షిణాఫ్రికా వెళతారు. రెండురోజుపాటు ప్రిటోరియా, జొహెన్నస్‌బర్గ్, డర్బన్, పీటర్‌మారిట్జ్ బర్గ్‌ల్లో పర్యటిస్తారు.
తర్వాత రెండురోజులు టాంజానియా, కెన్యాల్లో ప్రధాని మోదీ పర్యటన సాగనుంది. ఇండో ఆఫ్రికన్ సంబంధాల బలోపేతమే లక్ష్యంగా.. ఆయాదేశాల అధినేతలతో ప్రధాని మోదీ భేటీ అవుతారు. అక్కడి భారతీయులతోనూ ప్రత్యేకంగా సమావేశమవుతారు. కాగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా అయిదురోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మొజాంబిక్, దక్షిణాఫ్రికా, టాంజానియా, కెన్యాలో పర్యటిస్తారు.
తాజా వార్తలు
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి







