ప్రయాణికుల రాకపోకలతో శంషాబాద్ విమానాశ్రయం రికార్డు

- April 08, 2025 , by Maagulf
ప్రయాణికుల రాకపోకలతో శంషాబాద్ విమానాశ్రయం రికార్డు

హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి గౌరవంగా నిలుస్తున్న శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, మరోసారి తన ప్రతిభను నిరూపించుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ విమానాశ్రయం అత్యద్భుత ప్రదర్శనతో దేశవ్యాప్తంగా రికార్డుల్ని తిరగరాశింది. ప్రయాణికుల రాకపోకలలో గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తూ, ఇతర ప్రధాన విమానాశ్రయాలకంటే ముందంజ వేసింది.మొత్తం 2.13 కోట్ల మంది ప్రయాణికులు ఈ ఏడాది విమానాశ్రయం సేవలను వినియోగించారు.

15.20 శాతం వృద్ధితో దేశంలో అగ్రస్థానం
గత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి శంషాబాద్ ఎయిర్‌పోర్టు 15.20 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది దేశంలోని ఇతర విమానాశ్రయాలతో పోలిస్తే అత్యధికంగా ఉండడం గమనార్హం. ప్రయాణికుల సంఖ్యలో ఇలా గణనీయంగా పెరుగుదల రావడం, హైదరాబాద్ నగర అభివృద్ధికి, వ్యాపార, టూరిజం రంగాల్లో వేగవంతమైన ప్రగతికి నిదర్శనం.

మూడు నెలల్లోనే 74 లక్షల ప్రయాణికులు
ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు–మూడు నెలల వ్యవధిలో–ఈ విమానాశ్రయం మరో అద్భుతమైన రికార్డు సృష్టించింది. ఈ ముగింపు త్రైమాసికంలో మొత్తం 74 లక్షల మంది ప్రయాణికులు ఈ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రయాణించారు. సాధారణంగా నెలకు గరిష్ఠంగా 20 లక్షల ప్రయాణికులు రాకపోకలు సాగించే శంషాబాద్, ఈసారి ఆ అంచనాలను దాటి కొత్త శిఖరాలకు చేరుకుంది.

ఈ పెరుగుదల కారణంగా RGIA, చెన్నై మరియు కోల్‌కతా వంటి ప్రముఖ నగరాల విమానాశ్రయాలను అధిగమించగలిగింది. ఇది దేశీయ విమానయాన రంగంలో హైదరాబాద్ స్థానం మరింత బలపడుతున్నట్లు సూచిస్తుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com