ఒమన్ లో 35వేల కంటే ఎక్కువ వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- April 09, 2025
మస్కట్: వాణిజ్యం, పరిశ్రమ, పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ.. గడువు ముగిసిన లేదా కార్యకలాపాలను నిలిపివేసిన 35,778 వాణిజ్య రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మార్కెట్‌ను సమీక్షిస్తున్నామని, అన్ని యాక్టివ్ వాణిజ్య రిజిస్టర్ సంస్థలు ఉనికిని నిర్ధారించే క్రమంలో తనిఖీలు చేపట్టినట్టు మంత్రిత్వశాఖ వెల్లడించింది.
ఈ రెండవ దశ మార్కెట్ సమీక్ష.. గత రెండు దశాబ్దాలలో (2000 నుండి 2020 సంవత్సరాల వరకు) పనిచేయని లేదా గడువు ముగిసిన కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 1970 - 1999 సంవత్సరాల్లో కార్యకలాపాలు నిలిపివేసిన లేదా గడువు ముగిసిన కంపెనీలను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన మార్కెట్ సమీక్ష మొదటి దశలో భాగంగా 3,415 వాణిజ్య రిజిస్టర్లను రద్దు చేసినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







