బహ్రెయిన్ లో కార్డ్ స్కామ్..BD31,000 చోరీ చేసిన సిస్టర్స్..!!

- April 09, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో కార్డ్ స్కామ్..BD31,000 చోరీ చేసిన సిస్టర్స్..!!

మనామా: అరబ్ కు చెందిన ఇద్దరు సిస్టర్స్ విజిట్ వీసాలపై బహ్రెయిన్‌కు వచ్చి చోరీలకు పాల్పడ్డారని అభియోగాలు నమోదయ్యాయి. మూడు నెలల్లోనే వారు గల్ఫ్ దేశం నుండి చోరీ చేసిన క్రెడిట్ కార్డ్ వివరాలను ఉపయోగించి BD31,000 కంటే ఎక్కువ విలువైన 77 మొబైల్ ఫోన్‌లను ఆర్డర్ చేయడంలో విషయం బయటకు వచ్చింది.  వీరితోపాటు ఉన్న మరో వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని అధికారులు తెలిపారు. అతను హ్యాక్ చేయబడిన బ్యాంక్ కార్డ్ డేటాను ఉపయోగించి ఆర్డర్లు ఇచ్చాడని పేర్కొన్నారు. డెలివరీలన్నీ బహ్రెయిన్‌లోని సిస్టర్స్ అడ్రస్ కు వెళ్లినట్లు విచారణ సందర్భంగా గుర్తించారు. ఫారీన్ పేమెంట్స్, లోకల్ డెలివరీలు భారీగా ఉండటంతో సమాచారం అందుకున్న అధికారులు విచారణ చేయగా స్కామ్ వివరాలు వెల్లడయ్యాయి.  అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేషనల్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ ఆర్డర్లు సెప్టెంబర్, డిసెంబర్ 2024 మధ్య జరిగాయన్నారు.  మొత్తం BD31,081.366 విలువైన వస్తువులను ఆర్డర్ చేసి తెప్పించుకున్నారని పేర్కొన్నారు.  జరిగిన నేరాలను నిందితులు అంగీకరించారని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com