వాట్సాప్ యూజర్లకు బిగ్ వార్నింగ్..
- April 10, 2025
వాట్సాప్ యూజర్లకు బిగ్ వార్నింగ్..
వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మీ కంప్యూటర్ భద్రమేనా? మీ ప్రైవసీ, డేటా డేంజర్‌లో ఉన్నాయి జాగ్రత్త.. భారత సైబర్ భద్రతా సంస్థ, CERT-In (కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం), డెస్క్‌టాప్ కంప్యూటర్లలో వాట్సాప్ ఉపయోగిస్తున్న వినియోగదారులకు అత్యవసర హెచ్చరిక జారీ చేసింది.
వాట్సాప్ డెస్క్‌టాప్ పాత వెర్షన్‌లలో తీవ్రమైన భద్రతా లోపం ఉన్నట్టు గుర్తించింది. ఇలాంటి డివైజ్‌లలో హ్యాకర్లు మీ వ్యక్తిగత డేటాను దొంగిలించడం లేదా మీ కంప్యూటర్‌ను కూడా కంట్రోల్ చేసేందుకు అనుమతించవచ్చు. “విండోస్ వాట్సాప్ డెస్క్‌టాప్‌లో ఒక భద్రతా లోపం ఉందని రిపోర్టు తెలిపింది. సైబర్ నేరగాళ్లు ఆర్బిటరీ కోడ్‌ను రన్ చేసేందుకు వీలు కల్పిస్తుంది” అని ఏజెన్సీ హెచ్చరిస్తోంది.
ఈ వెర్షన్ విండోస్ సాఫ్ట్‌వేర్ల పై ప్రభావం:
మీరు వాడే కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ఏదైనా సరే… 2.2450.6 కన్నా ముందు ఉన్న Windows వెర్షన్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఇలాంటి డివైజ్‌లలో వాట్సాప్ డెస్క్‌టాప్‌ను ప్రభావితం చేస్తుంది. మీరు పాత వెర్షన్‌ను ఉపయోగిస్తుంటే.. త్వరగా అప్‌డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం.
“MIME టైప్, ఫైల్ ఎక్స్‌టెన్షన్ మధ్య తప్పుగా కాన్ఫిగర్ చేయడం వల్ల ఈ భద్రతా లోపం తలెత్తుతుంది. అటాచ్మెంట్ ఓపెనింగ్ సరిగా జరగదు. వాట్సాప్‌లో మాన్యువల్‌గా ఓపెన్ చేసినప్పుడు ఆర్బిటరీ కోడ్‌ను రన్ చేసే డేంజరస్ అటాచ్‌మెంట్ ద్వారా మీ డేటాను దొంగిలించవచ్చు. ఈ లోపం కారణంగానే సైబర్ దాడి చేసే వ్యక్తి ఆర్బిటరీ కోడ్‌ను రన్ చేసేందుకు అనుమతిస్తుంది” అని CERT-In తెలిపింది.
ఎలా సేఫ్‌గా ఉండాలంటే?
- హ్యాకర్ల నుంచి మీ వాట్సాప్ సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి.
- వాట్సాప్ డెస్క్‌టాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు (2.2450.6 లేదా ఆపై వెర్షన్) అప్‌డేట్ చేయండి.
- వాట్సాప్ డెస్క్‌టాప్ ద్వారా వచ్చిన అనుమానాస్పద ఫైల్స్ లేదా తెలియని అటాచ్‌మెంట్‌లను ఓపెన్ చేయొద్దు.
- రిస్క్ తగ్గేందుకు మీ ఆపరేటింగ్ సిస్టమ్, యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తూ ఉండండి.
- మీకు తెలియని వ్యక్తుల నుంచి లింక్‌లపై క్లిక్ చేయవద్దు లేదా ఫైల్స్ ఓపెన్ చేయొద్దు.
- మైక్రోసాఫ్ట్ స్టోర్ లేదా వాట్సాప్ అధికారిక వెబ్‌సైట్ వంటి అధికారిక సోర్స్ నుంచి మాత్రమే వాట్సాప్ అప్‌డేట్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి.
- ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ కంప్యూటర్, వ్యక్తిగత డేటాను సైబర్ నేరగాళ్ల నుంచి సురక్షితంగా ఉంచుకోవచ్చు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!