రియల్ లైఫ్‌లోనూ గ్రేట్ హీరో అనిపించుకున్నా మంచువిష్ణు
- July 07, 2016
రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ గ్రేట్ హీరో అనిపించుకున్నాడు నటుడు మంచువిష్ణు. పక్షవాతానికిగురైన ఓ నిరుపేద జర్నలిస్టు జీవితానికి కొత్త ఆశలు చిగురింప చేశాడు. జర్నలిస్టు దుర్గాగౌడ్ హెల్త్ కోసం సహాయం చేశాడు.
ఆయన పిల్లలను చదివించేందుకు రూ.22 లక్షలను ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. ఏడాది కాలంగా పక్షవాతంతో మంచం పట్టి చావుబతులకులతో పోరాడుతున్న జర్నలిస్టు దుర్గాగౌడ్ కష్టాలను చూపుతూ మేముసైతం కార్యక్రమం తెర పైకి తెచ్చింది.
ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నమంచు విష్ణు.. బాధిత జర్నలిస్టు కష్టాలను విని కదిలిపోయాడు. ఒక్క రోజు పానీపూరి అమ్మి తన వంతుగా 75,000 రూపాయలు సంపాదించాడు. వాటిని జర్నలిస్టు దుర్గా ఆరోగ్యం కోసం ఇచ్చారు.
ఆయన పిల్లలిద్దరికి నర్సరీ నుంచి ఇంటర్ వరకు కార్పోరేట్ విద్య అందించేందుకు 22 లక్షల ఇస్తానని చెప్పాడు. దీంతో విష్ణు పైన ప్రశంసల వర్షం కురుస్తోంది. నిజ జీవితంలోనూ గ్రేట్ హీరో అనిపించుకున్న మంచు విష్ణుకు జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు.
మంచులక్ష్మి కూడా తనవంతుగా లక్ష రూపాయల సహాయం ప్రకటించింది. మొత్తం 1 లక్షా 75 వేల రూపాయల చెక్కును దుర్గాగౌడ్ కుటుంబానికి అందించారు.
అంటే దాదాపుగా 24 లక్షల రూపాయల సహాయం అందించిన మంచు విష్ణు, మంచు లక్ష్మిలకు హ్యాట్సాప్ చెబుతున్నారు. దొంగాట మూవీ డైరెక్టర్ వంశీకృష్ణకు జర్నలిస్డటులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జర్నలిస్టు దుర్గా జీవితానికి భరోసా అందించేందుకు సహాయ పడుతున్న ప్రతి ఒక్కరికి స్వామి ముద్దం కృతజ్ఞతలు చెప్పారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







