నెదర్లాండ్స్ లో సుల్తాన్ కు ఘన స్వాగతం..!!
- April 15, 2025
ఆమ్స్టర్డామ్: సుల్తాన్ హైతం బిన్ తారిక్ నెదర్లాండ్స్ లో మూడు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం సాయంత్రం ఆమ్స్టర్డామ్ చేరుకున్నారు. రాయల్ విమానం నెదర్లాండ్స్ వైమానిక పరిధిలోకి ప్రవేశించినప్పుడు, రాయల్ నెదర్లాండ్స్ వైమానిక దళం సైనిక విమానాలు దానికి గార్డ్ ఆఫ్ ఆనర్ కల్పించి అనుసరించాయి. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయంలో దిగగానే కింగ్ సైనిక భవనం అధిపతి రియర్ అడ్మిరల్ లడ్జర్ బ్రుమ్మెలార్, విదేశీ వాణిజ్యం, అభివృద్ధి మంత్రి రీనెట్ క్లేవర్, నెదర్లాండ్స్‌లోని కొంతమంది అధికారులు, నెదర్లాండ్స్‌లోని ఒమానీ రాయబార కార్యాలయం మెంబర్లు సుల్తాన్ కు ఘన స్వాగతం పలికారు. నెదర్లాండ్స్ రాజు విల్లెం-అలెగ్జాండర్.. సుల్తాన్ హైతం బిన్ తారిక్ కు అధికారిక స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించారు. తన పర్యటనలో భాగంగాసుల్తాన్ పలు అధికారిక కార్యక్రమాలు, కీలక చర్చల్లో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్‌లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







