శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు..

- April 15, 2025 , by Maagulf
శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు..

టీమ్ఇండియా మిడిల్ ఆర్డ‌ర్ ఆట‌గాడు శ్రేయ‌స్ అయ్యర్‌కు అరుదైన గౌర‌వం ల‌భించింది. మార్చి 2025 గానూ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డు కోసం న్యూజిలాండ్‌కు చెందిన ర‌చిన్ ర‌వీంద్ర‌, జేక‌బ్ డ‌ఫీతో అత‌డు పోటీప‌డ్డాడు. ఐసీసీ ఓటింగ్ అకాడ‌మీ స‌భ్యుల‌తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఓటింగ్‌లో పాల్గొన్నారు.

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో భార‌త్ త‌రుపున శ్రేయ‌స్ అయ్య‌ర్ అద్భుతంగా రాణించాడు. 243 ప‌రుగులతో భార‌త్ త‌రుపున అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిలిచాడు. భార‌త జ‌ట్టు ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేత‌గా నిల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.

మార్చి నెల‌లో జ‌రిగిన మూడు మ్యాచ్‌ల్లో 57.33 సగటున 172 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన గ్రూప్‌ మ్యాచ్‌లో 79 పరుగులు, సెమీస్‌లో ఆస్ట్రేలియా పై 45 ప‌రుగులు, ఫైనల్లో న్యూజిలాండ్‌పై 48 ప‌రుగులు చేశాడు.

కాగా.. అయ్య‌ర్ ఈ అవార్డు గెలుచుకోవ‌డం ఇది రెండో సారి. ఫిబ్ర‌వ‌రి 2022లో ఈ అవార్డును అయ్య‌ర్ సొంతం చేసుకున్నాడు. టీమ్ఇండియా ఆట‌గాళ్ల‌లో బుమ్రా, గిల్ లు మాత్రమే రెండు కంటే ఎక్కువ సార్లు ఈ అవార్డును గెలుచుకున్నారు. ఈ అవార్డును అందుకోవ‌డం ప‌ట్ల శ్రేయ‌స్ అయ్య‌ర్ ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. ఈ గుర్తింపు ఎంతో ప్ర‌త్యేక‌మైంద‌న్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com