ప్యారిస్‌లో షేక్ జాయెద్ సెంటర్
- July 07, 2016
ఫ్రెంచ్ రాజధాని ప్యారిస్‌లోని ముసీ దు లావెరె (లావెరె మ్యూజియం) వద్ద షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ సెంటర్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యూఏఈ ఫౌండింగ్ ఫాదర్‌కి నివాళులర్పించారు. ఈ సెంటర్‌లో అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో మీడియా టూల్స్‌ని ఏర్పాటు చేశారు. త్రీడీ ఫిలింస్, యానిమేషన్స్, మోడల్స్ ఇంకా పలు ఆసక్తికరమైన అంశాలున్నాయిక్కడ. ఈ కార్యక్రమానికి మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ హోలాండె, అబుదాబీ టూరిజం అండ్ కల్చర్ అథారిటీ ఛైర్మన్ మొహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్, మినిస్ట్రీ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఎఫైర్స్ కల్చరల్ అడ్వయిజర్ జాకి నుసెయిబె, సైఫ్ గోబాష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా షేక్ అబ్దుల్లా, ప్రెసిడెంట్ హోలాండెకి కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాల మధ్యా సన్నిహిత సంబంధాలు ఇంకా బలోపేతమవ్వాలని ఆకాంక్షించారు. ఈ ప్రాజెక్ట్ సంయుక్తం చేపట్టిన అతి పెద్ద ప్రాజెక్టు అని హోలాండె చెప్పారు. నెలల వ్యవధిలోనే లావెరె అబుదాబీ మ్యూజియం ప్రారంభమవుతుందని చెప్పారాయన. ఈ మ్యూజియం ప్రపంచానికి సంస్కృతిక సంబంధాల గొప్పతనాన్ని మరింతగా తెలియజేస్తుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







