హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు భారీ షాక్
- April 17, 2025
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు త్వరలో ఛార్జీల పెంపు రూపంలో ఊహించని భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి. మెట్రో సేవలను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ సంస్థ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్టు సమాచారం. కోవిడ్-19 సమయంలో ప్రయాణికుల రాకపోకలు తగ్గిపోవడం వల్ల వచ్చిన నష్టాలు ఇంకా తేరుకోకపోవడంతో, దాదాపు రూ. 6,500 కోట్ల నష్టం వాటిల్లినట్టు కంపెనీ వెల్లడించింది.
ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఛార్జీలను పెంచడం
ఈ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఛార్జీలను పెంచడం తప్పనిసరిగా మారిందని ఎల్ అండ్ టీ భావిస్తోంది. ఇప్పటికే బెంగళూరు మెట్రో ఛార్జీలను 44 శాతం పెంచిన నేపథ్యంలో, హైదరాబాద్‌లో కూడా ఇదే దిశగా నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఈ నిర్ణయానికి పునాది వేస్తూ, సంస్థ ఇటీవల రూ. 59 హాలిడే సేవర్ కార్డు, పీక్ అవర్స్ డిస్కౌంట్లను సైలెంట్‌గా రద్దు చేసింది. వీటిని చూసిన ప్రయాణికులు త్వరలో ఛార్జీలు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్‌లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







