ఇకపై ఎమిరేట్స్ ID కార్డులకు సెలవు..ఫేస్ రికగ్నిషన్ డిజిటల్ ID వ్యవస్థ..!!

- April 17, 2025 , by Maagulf
ఇకపై ఎమిరేట్స్ ID కార్డులకు సెలవు..ఫేస్ రికగ్నిషన్ డిజిటల్ ID వ్యవస్థ..!!

యూఏఈః ఇకపై ఎమిరేట్స్ ID కార్డులను సమర్పించాల్సిన అవసరాన్ని తొలగించే ప్రత్యామ్నాయ డిజిటల్ గుర్తింపు వ్యవస్థను యూఏఈ రూపొందించనుంది. ఒక సంవత్సరంలోపు ప్రారంభించాలని భావిస్తున్న ఈ వ్యవస్థ.. వివిధ రంగాలలో ఫేస్ రికగ్నిషన్, బయోమెట్రిక్ గుర్తింపును ఉపయోగించనున్నారు. ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్ సెక్యూరిటీ (ICP) ప్రణాళికలను రూపొందిస్తుంది. ప్రస్తుతం బ్యాంకింగ్, హెల్త్‌కేర్, హాస్పిటాలిటీ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాలలో ఇ-ఎమిరేట్స్ IDలను వినియోగిస్తున్నారు.  డిజిటల్ వినియోగంలో యూఏఈ గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, ఫిజికల్ ఎమిరేట్స్ ID కార్డుల కార్డుల విసృత వినియోగంపై మెంబర్ అద్నాన్ అల్ హమ్మది ఆందోళన వ్యక్తం చేశారు. ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ (FNC) సెషన్ సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఫిజికల్ ఐడీ అనేది నివాసితులకు సవాళ్లను కలిగిస్తూనే ఉందని అల్ హమ్మది గుర్తించారు. ఆరోగ్య సంరక్షణ సేవలను పొందడానికి రోగులు ఇప్పటికీ ఫిజికల్ ID కార్డులను సమర్పించాల్సి ఉంటుందని, అయితే బ్యాంకులు ఆర్థిక లావాదేవీల కోసం వాటిని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. "ఈ ముఖ్యమైన రంగాలలో గుర్తింపు ధృవీకరణను క్రమబద్ధీకరించడానికి వేగవంతమైన, సమర్థవంతమైన పరిష్కారాల అవసరం ఉంది" అని ఆయన అన్నారు.
ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ వ్యవహారాల సహాయ మంత్రి అబ్దుల్ రెహమాన్ అల్ ఒవైస్ మాట్లాడుతూ.. ఇ-ఎమిరేట్స్ ఐడీ ఇప్పటికే అనేక సేవలలో విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. FNC హైలైట్ చేసిన రంగాలలో దాని వినియోగాన్ని విస్తరించడానికి అధికారం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు. పౌరులు, నివాసితులకు అనేక సేవలను యాక్సెస్ చేయడానికి వీలు కల్పించే మొట్టమొదటి సురక్షితమైన జాతీయ డిజిటల్ గుర్తింపు అయిన UAEPASS యాప్ కోసం GITEX 2021 సందర్భంగా అథారిటీ ముందుగా ముఖ గుర్తింపు సేవను ప్రారంభించింది. వినియోగదారులందరికీ నమ్మకాన్ని పెంపొందించడానికి, స్మార్ట్ సేవల ప్రయోజనాలను నిర్వహించడానికి చట్టాలు, డేటా రక్షణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసే స్పష్టమైన విధానాన్ని అధికార యంత్రాంగం రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com