షార్జాలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త వేతన స్కేల్..!!

- April 18, 2025 , by Maagulf
షార్జాలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త వేతన స్కేల్..!!

యూఏఈ: షార్జా ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం కొత్త జీతం స్కేల్‌ను షార్జా పాలకుడు ఆమోదించారు. అలాగే ప్రతి ఉద్యోగ గ్రేడ్‌లో ప్రామాణిక నాలుగు సంవత్సరాల పదవీకాలంతో పాటు 'స్పెషల్ ఎ',  'స్పెషల్ బి' అనే రెండు కొత్త ఉద్యోగ గ్రేడ్‌లను కొత్తగా నమోదు చేయనున్నారు. కొత్త జీతం స్కేల్ ఉద్యోగ భద్రతను పెంచుతుందని, ప్రభుత్వ రంగంలోని ఎమిరాటీ పౌరులకు కెరీర్ పురోగతికి స్పష్టమైన మార్గాలను అందిస్తుందని భావిస్తున్నారు. షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ప్రభుత్వంలో పనిచేస్తున్న ఎమిరాటీ ఇంజనీర్ల కోసం ప్రత్యేకంగా సవరించిన జీతం స్కేల్‌ను కూడా ఆమోదించారు. ఇందులో కొత్త 'స్పెషల్' గ్రేడ్ పరిచయం చేశారు. జీతం స్కేల్ ఇంజనీరింగ్ స్థానాలకు ప్రతి ఉద్యోగ స్థాయిలో నాలుగు సంవత్సరాల వ్యవధిని కూడా నిర్దేశిస్తుంది.
షార్జాలోని మానవ వనరుల విభాగాధిపతి అబ్దుల్లా ఇబ్రహీం అల్ జాబి మాట్లాడుతూ.. "సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకున్న తర్వాత షార్జా ప్రభుత్వంలోని ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రొఫెషనల్ ఇంజనీర్లకు జీతాల స్కేళ్లకు సంబంధించి షార్జా పాలకుడి ఆదేశాలను అమలు చేయడం ప్రారంభిస్తాము. ఈ ఆదేశాలను అభినందిస్తూ షార్జా ప్రభుత్వ ఉద్యోగులు మరింత కృషి, అంకితభావంతో పనిచేయాలని మేము కోరుతున్నాము." అని అభిప్రాపడ్డారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com