ఒమన్‌లో తొలిసారిగా కనిపించిన బ్లాక్ కోబ్రా..!!
- April 18, 2025
మస్కట్: అత్యంత విషపూరితమైన జాతి అయిన బ్లాక్ కోబ్రాను ఒమన్‌లో తొలిసారిగా గుర్తించారు. ధోఫర్ గవర్నరేట్‌లో నల్ల కోబ్రా మొదటి డాక్యుమెంటేషన్‌ను పర్యావరణ అథారిటీ అధికారికంగా నమోదు చేసింది. స్పెయిన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎవల్యూషనరీ బయాలజీ, నిజ్వా విశ్వవిద్యాలయం సహకారంతో ఈ ఘనతను సాధించారు.
బ్లాక్ కోబ్రా (వాల్టెరిన్నేషియా ఈజిప్టియా) ఆవిష్కరణతో ఒమన్‌లో అధికారికంగా నమోదు చేయబడిన పాము జాతుల మొత్తం సంఖ్య ఇప్పుడు 22కి చేరుకుంది. ఇది జీవవైవిధ్య పరిరక్షణ, స్థానిక వన్యప్రాణులపై శాస్త్రీయ పరిశోధనలను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
బ్లాక్ కోబ్రా అని పిలువబడే కోబ్రా, మధ్యప్రాచ్యంలో విస్తృతంగా వ్యాపించిన అత్యంత విషపూరిత జాతులలో ఒకటిగా భావిస్తారు. ఇది శాస్త్రీయ పరిశోధనలకు గణనీయంగా దోహదపడుతుంది. ఈ పరిశోధన ఫలితాలు ఏప్రిల్ 2025లో సైంటిఫిక్ జర్నల్ ZOOTAXAలో ప్రచురించారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







