దుబాయ్: ఇద్దరు ప్రవాసులు మృతి..బాధిత కుటుంబాలకు అండగా భారత కాన్సులేట్..!!
- April 17, 2025
దుబాయ్: దుబాయ్‌లో మరణించిన తెలంగాణకు చెందిన ఇద్దరు కార్మికుల కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నట్లు దుబాయ్‌లోని భారత కాన్సులేట్ జనరల్ తెలిపింది. “దుబాయ్‌లో ఇద్దరు భారతీయుల మరణాల గురించి మాకు తెలిసింది.బాధితుల కుటుంబాలతో మేము సంప్రదిస్తున్నాము.సాధ్యమైనంత సహాయం అందించడానికి మేము దుబాయ్ అధికారులు, ప్రవాస సభ్యులతో కలిసి పనిచేస్తున్నాము.”అని కాన్సులేట్ ఒక ప్రకటనలో తెలిపింది.
మృతులను నిర్మల్ జిల్లాలోని సోన్ గ్రామానికి చెందిన అష్టపు ప్రేమ్‌సాగర్(35), నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు.వారు పనిచేసిన దుబాయ్‌లోని బేకరీలో ఏప్రిల్ 11న దాడి జరిగినట్లు సమాచారం.ఇదే సంఘటనలో గాయపడిన మూడో భారతీయుడు సాగర్ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారని ఆయన భార్య నిజామాబాద్‌లో విలేకరులకు తెలిపారు.
ప్రేమ్‌సాగర్ గత ఐదు సంవత్సరాలుగా బేకరీలో పనిచేస్తున్నాడు.ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
భారత కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలంగాణ వాసుల మరణం పై స్పందించారు.తీవ్ర విచారం, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ విషయం పై విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ జీతో మాట్లాడినట్టు తెలిపారు.మృతుల కుటుంబాలకు పూర్తి మద్దతు ఇస్తానని, మృతదేహాన్ని వెంటనే స్వదేశానికి తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని Xలో పోస్ట్ పేర్కొన్నారు.
కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా ఈ విషాదం పై స్పందించారు.విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అధికారులతో మాట్లాడానని తెలిపారు. దర్యాప్తుతోపాటు మృతదేహాలను స్వదేశానికి తరలించే ప్రక్రియ రెండింటినీ వేగవంతం చేయాలని దుబాయ్ లోని భారత కాన్సులేట్..దుబాయ్ పోలీసులను అభ్యర్థించిందని పేర్కొన్నారు."బాధితులను త్వరగా స్వదేశానికి రప్పించడానికి అవసరమైన అన్ని సహాయాలను మేము అందిస్తున్నాము.ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబాలకు అండగా నిలుస్తాము." అని ఆయన అన్నారు.
మరోవైపు భారత ప్రవాసుల మరణాలకు సంబంధించిన పరిస్థితులు ప్రస్తుతం దర్యాప్తులో ఉన్నాయని, ఈ కేసును నిశితంగా పర్యవేక్షిస్తూ, అవసరమైన అన్ని సహాయాలను అందిస్తామని భారత కాన్సులేట్ హామీ ఇచ్చింది.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







