విదేశీ విద్యార్థుల పై ట్రంప్ ఉక్కుపాదం
- April 19, 2025
అమెరికా: అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్‌లో చోటు చేసుకుంటోన్న మార్పులు..భారతీయ విద్యార్థులను దెబ్బకొడుతున్నాయి.వారి పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థుల ఆశలను నీరుగారుస్తోన్నాయి.ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతీయ విద్యార్థులే అధికంగా బలి అవుతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. చదువుకోవడానికి తమ దేశానికి వచ్చే విదేశీ విద్యార్థులపై డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్..ఉక్కుపాదం మోపుతోన్న విషయం తెలిసిందే. స్టూడెంట్స్ విసాల్లో పెను మార్పులను తీసుకొచ్చాయి ఈ రెండు శాఖలు.
సోషల్ మీడియా అకౌంట్లపై నిఘా
దీనివల్ల భారతీయ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. కిందటి నెలలో 300లకు పైగా స్టూడెంట్స్ వీసాలు రద్దయినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వెల్లడించింది. స్టూడెంట్ విసాల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ల మనస్తత్వం ఎలాంటిదని తెలుసుకోవడానికి వాళ్ల సోషల్ మీడియా అకౌంట్లపై నిఘా పెట్టింది. క్యాచ్ అండ్ రివోక్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం- క్యాచ్ అండ్ రివోక్లో 327 కేసులు నమోదు కాగా.. ఇందులో 50 శాతం భారతీయ విద్యార్థులే. మిగిలిన దేశాలతో పోల్చుకుంటే భారతీయ స్టూడెంట్ విసాలే అధిక శాతం రద్దు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ ఏడాది జనవరి 20వ తేదీ నుంచి అంటే- అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తేదీ నుంచి 4,736 దరఖాస్తులు రద్దయినట్లు స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తెలిపింది. వీటిలో ఎక్కువ శాతం ఎఫ్1 కేటగిరీలో ఉన్నవే. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అమలులోకి వచ్చిన సెవిస్ టెర్మినేషన్ కొత్త నిబంధనలు, విధి విధానాలపై ప్రభుత్వం నుండి ముందస్తు సమాచారం లేదని , ఇది విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోందని అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ చెబుతోంది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







