బహ్రెయిన్ లో ఒడియా సమాజ్ ఉత్కల్ దిబాస..సాంస్కృతిక వైభవం..!!
- April 20, 2025
మనామా: బహ్రెయిన్‌లోని ఒడియా డయాస్పోరా శక్తివంతమైన సంఘం అయిన బహ్రెయిన్ ఒడియా సమాజ్, 90వ ఉత్కల్ దిబాసను విశేషమైన ఉత్సాహం, వైభవంతో జరుపుకుంది. దాదాపు 100 ఒడియా కుటుంబాలు సహా 300 మందికి పైగా హాజరయ్యారు.
ఈ వేడుకకు బహ్రెయిన్ లోని భారత రాయబారి వినోద్ జాకబ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాయంత్రం స్టార్ హంగామా అందరినీ ఆకట్టుకుంది. ఒడియా హాస్యనటుడు పాపు పోమ్ పోమ్, ప్రముఖ నేపథ్య గాయని ఆనందితా దాస్ తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించాయి.
ఒడిశా వారసత్వ గొప్పతనాన్ని తెలిపేలా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. సమాజ సభ్యులు - పురుషులు, మహిళలు , పిల్లలు - సాంప్రదాయ కోరాపుట్ , సంబల్పురి నృత్య ప్రదర్శనలు, శ్రావ్యమైన ఒడియా పాటలు, "మో ఒడిశా" అనే థీమ్‌తో కూడిన ఫ్యాషన్ షో అందరని ఆకట్టుకుంది. చివరగా అందరిని ట్రోఫీలు, అవార్డులతో సత్కరించారు.
ఈ కార్యక్రమం బహ్రెయిన్ ఒడియా సమాజ్ అధ్యక్షుడు శ్రీ ప్రభాకర్ పాధి స్వాగత ప్రసంగంతో ప్రారంభమైంది. తరువాత ప్రముఖ ఒడియా పారిశ్రామికవేత్త దేబాలోకనాథ్ మొహంతి, బహ్రెయిన్ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ హసన్ ఈద్ బుఖామాస్ స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేశారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







