డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్‌ యాప్‌ ప్రారంభం

- January 14, 2026 , by Maagulf
డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్‌ యాప్‌ ప్రారంభం

హైదరాబాద్‌: రక్తం అవసరమైన వారికి తక్షణమే దాతలను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో రూపొందించిన ‘కాల్ ఫర్ బ్లడ్ ఫౌండేషన్’ వెబ్‌ అప్లికేషన్‌ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి  మంగళవారం నాడు ప్రారంభించారు.

రక్తదాతలు–పేషెంట్ల మధ్య వేగంగా సమాచారం అందేలా ఈ వెబ్‌ యాప్‌ను రూపొందించారు. రక్తం అవసరమైన సమయంలో  దాతను గుర్తించే సాంకేతిక సదుపాయం ఈ అప్లికేషన్‌లో అందుబాటులో ఉంది. రక్తదాతల వివరాలు గోప్యంగా ఉండే విధంగా, ఆధునిక సాంకేతికతతో ఈ యాప్‌ను అభివృద్ధి చేశారు.

ఈ వెబ్‌ అప్లికేషన్‌లో రక్తదాతల వ్యక్తిగత వివరాలకు పూర్తి భద్రత కల్పించే విధానం, రక్తదానం చేసిన తరువాత నిర్దిష్ట కాలం వరకు వారి వివరాలు కనిపించకుండా ఉంచే సదుపాయం, అలాగే అత్యవసర పరిస్థితుల్లో త్వరగా దాతను గుర్తించే వ్యవస్థ వంటి ప్రత్యేక ఫీచర్లను పొందుపరిచారు.

‘కాల్ ఫర్ బ్లడ్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ వెబ్‌ యాప్‌ ద్వారా రక్తదానం ప్రక్రియను మరింత సులభతరం చేసి, అవసరమైన వారికి సమయానికి రక్తం అందేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చింతల సంపత్ ను డిజిపి అభినందించారు.వివరాల కోసం కాల్ ఫర్ బ్లడ్ ఫౌండేషన్ డాట్ కామ్ వెబ్ సైట్ నుండి వివరాలు తెలుసుకోవచ్చని  సిహెచ్ సంపత్ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com