ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- January 15, 2026
న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ సంబరాల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టులో దర్శనం ఇచ్చిన రామ్మోహన్ నాయుడు ను చూసి ప్రధాని మోదీ తో సహా అందరూ చాలా బాగుంది అంటూ మెచ్చుకున్నారు.
దక్షిణాది రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించేలా డిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో బుధవారం నాడు పండుగ వేడుకలు జరిగాయి. తెలుగు, తమిళ సంప్రదాయాలను మిళితం చేస్తూ.. ఆనాటి ఆచార వ్యవహారాలను గుర్తు చేస్తూ ఆద్యంతం ఆసక్తికరంగా కార్యక్రమం సాగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరవ్వగా.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.. తన సహచర మంత్రులు, ఎంపీలతో కలసి వేడుకల్లో భాగస్వామ్యమయ్యారు. ఈ సందర్భంగా దక్షిణాది పండుగ సంక్రాంతి వేడుకల్లో భాగస్వామ్యం అయినందుకు ప్రధాని మోదీని రామ్మోహన్ నాయుడు సత్కరించారు.
అయితే ఎప్పుడూ కోట్ జాకెట్ డ్రెస్సింగ్ విధానాన్ని అవలంభించే రామ్మోహన్ నాయుడు.. అందుకు భిన్నంగా తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టు, ధోవతి వేసుకుని ఈ యువ కేంద్ర మంత్రి దర్శనం ఇచ్చారు. వినూత్నంగా కనిపిస్తున్న రామ్మోహన్ నాయుడును మోదీతో సహా అక్కడున్న వారు చాలా బాగుంది అంటూ మెచ్చుకున్నారు
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







