బహ్రెయిన్ లో ఒడియా సమాజ్ ఉత్కల్ దిబాస..సాంస్కృతిక వైభవం..!!

- April 20, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో ఒడియా సమాజ్ ఉత్కల్ దిబాస..సాంస్కృతిక వైభవం..!!

మనామా: బహ్రెయిన్‌లోని ఒడియా డయాస్పోరా శక్తివంతమైన సంఘం అయిన బహ్రెయిన్ ఒడియా సమాజ్, 90వ ఉత్కల్ దిబాసను విశేషమైన ఉత్సాహం, వైభవంతో జరుపుకుంది. దాదాపు 100 ఒడియా కుటుంబాలు సహా 300 మందికి పైగా హాజరయ్యారు.

ఈ వేడుకకు బహ్రెయిన్ లోని భారత రాయబారి వినోద్ జాకబ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాయంత్రం స్టార్ హంగామా అందరినీ ఆకట్టుకుంది. ఒడియా హాస్యనటుడు పాపు పోమ్ పోమ్, ప్రముఖ నేపథ్య గాయని ఆనందితా దాస్ తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించాయి.

ఒడిశా వారసత్వ గొప్పతనాన్ని తెలిపేలా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. సమాజ సభ్యులు - పురుషులు, మహిళలు , పిల్లలు - సాంప్రదాయ కోరాపుట్ , సంబల్పురి నృత్య ప్రదర్శనలు, శ్రావ్యమైన ఒడియా పాటలు, "మో ఒడిశా" అనే థీమ్‌తో కూడిన ఫ్యాషన్ షో అందరని ఆకట్టుకుంది. చివరగా అందరిని ట్రోఫీలు, అవార్డులతో సత్కరించారు.

ఈ కార్యక్రమం బహ్రెయిన్ ఒడియా సమాజ్ అధ్యక్షుడు శ్రీ ప్రభాకర్ పాధి స్వాగత ప్రసంగంతో ప్రారంభమైంది. తరువాత ప్రముఖ ఒడియా పారిశ్రామికవేత్త దేబాలోకనాథ్ మొహంతి, బహ్రెయిన్ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ హసన్ ఈద్ బుఖామాస్ స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేశారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com