కస్టమర్లకు 'ఎర్రర్' SMS.. క్షమాపణలు చెప్పిన యూఏఈ బ్యాంక్..!!
- April 21, 2025
యూఏఈ: కొంతమంది కస్టమర్లకు 'మోసపూరితంగా' అనిపించిన 'ఎర్రర్' మెసేజులు రావడంతో ఆదివారం యూఏఈ బ్యాంక్ వారికి క్షమాపణలు చెప్పింది.సోషల్ మీడియా ద్వారా పలువురు బ్యాంక్ కస్టమర్లు మెసేజులు వచ్చిన తెలిపారు.ఇవన్నీ ఫ్రాడ్ లా అనిపించాయని ఫిర్యాదులు చేశారు. తాము బ్యాంకుకు కాల్ చేసినా.. దాదాపు గంటసేపు ఎటువంటి స్పందన రాలేదని పలువురు కస్టమర్లు అసహనంవ్యక్తం చేశారు.
"మీ పెద్ద బ్యాంకు కాల్స్‌కు హాజరు కాగల కస్టమర్ కేర్ ఏజెంట్లు లేరు. 45 నుండి 60 నిమిషాల తర్వాత ఎవరో ఒకరు కాల్‌కు హాజరై, అది సాంకేతిక లోపం అని చెప్పి క్షమాపణలు చెప్పారు" అని వినియోగదారులు ఆన్లైన్లో రాసుకొచ్చారు. బ్యాంకు సోషల్ మీడియా అకౌంట్ లోఇలాంటి లావాదేవీల భయాల గురించి ఫిర్యాదు చేసే కస్టమర్ల కమెంట్లతో నిండిపోయింది.
'RA DISB MIGRATION' అనే పేరుతో వచ్చిన SMS దాని సిస్టమ్ అప్‌గ్రేడ్ సమయంలో ఒక లోపం అని బ్యాంక్ స్పష్టం చేసింది. "మీరు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.ఈరోజు మీకు వచ్చిన 'RA DISB MIGRATION' అనే SMS కి సంబంధించినది అయితే, దయచేసి ENBD నుండి వచ్చిన సందేశాన్ని విస్మరించండి. మా సిస్టమ్ అప్‌గ్రేడ్ సమయంలో అది పొరపాటున పంపబడింది." అని బ్యాంకు క్షమాపణలు చెప్పింది.
తాజా వార్తలు
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!







