ఏపీ: విద్యార్థులకు గుడ్న్యూస్..
- April 22, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పాఠశాలల విద్యార్థులకు గుడ్న్యూస్.ఈ సారి 48 రోజులు సమ్మర్ హాలీడేస్ ఉండనున్నాయి. ఏపీలోని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చింది. పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభమవుతాయి. అన్ని స్కూళ్లకు బుధవారం ఈ ఏడాది చివరి పని దినం కానుంది.
వేసవి సెలవుల్లో ఇలా గడపండి
సమ్మర్ హాలీడేస్లో పాఠశాల పిల్లలు సమయాన్ని సరదాగానూ గడపాలి, అలాగే, మీ నాలెడ్జ్ను పెంచుకునేలానూ గడపాలి. ఇందుకోసం తల్లిదండ్రులు ఓ ప్రణాళిక చేసుకోవడం చాలా మంచిది. చదువులో పిల్లల అభిరుచి పెంచేందుకు కథలు, బాల పత్రికలు, కార్టూన్ బుక్స్ చదివించాలి.
స్థానిక గ్రంథాలయాల వద్దకు పిల్లలను తీసుకెళ్లాలి. కొత్త పదాలు నేర్చుకోవడం, కథలు రాయడం వంటిని నేర్చుకునేలా చేయాలి. చిత్రలేఖనం, మట్టి బొమ్మలు, క్రాఫ్ట్ పనులు వంటివి నేర్పించవచ్చు. పజిల్స్, సుడోకు, చెస్ వంటిని మీ పిల్లల తెలివితేటలను, సమయస్ఫూర్తిని పెంచుతాయి.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







