ఇస్లామిక్ ఉగ్రవాదుల మారణకాండ కొనసాగుతోంది

- July 07, 2016 , by Maagulf
ఇస్లామిక్ ఉగ్రవాదుల మారణకాండ కొనసాగుతోంది

ఇరాక్‌: ఇస్లామిక్ ఉగ్రవాదుల మారణకాండ కొనసాగుతోంది. గురువారం సాయంత్రం ఆత్మాహుతి దాడులతో ఉత్తర బాగ్దాద్‌ ప్రాంతంలో మరోసారి బీభత్సం సృష్టించారు. ఈద్‌ ఉల్‌ ఫితర్‌ వేడుకలే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు, పేలుళ్లకు పాల్పడ్డారు.
ఓ ప్రార్థనా మందిరం వద్ద ముష్కరులు వరుస ఆత్మాహుతి పేలుళ్లు, కాల్పులలకు పాల్పడటంతో 35 మంది మృతిచెందారు. ఈ పేలుళ్లలో మరో 60మందికి పైగా గాయపడ్డారు.
ఐఎస్ ఆత్మాహుది దాడులు: 213మంది మృతి
గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. తొలుత విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు, అనంతరం బెల్టుబాబులతో ఉగ్రవాదులు తమను తాము పేల్చేసుకున్నారు.
కాగా, ఐదు రోజుల క్రితం బాగ్దాద్‌లో ఐఎస్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 292 మంది పౌరులు మృతి చెందిన విషయం తెలిసింది. వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com