స్నైపర్ల దాడి.. పోలీసులు మృతి..
- July 07, 2016
జాతివివక్ష ఆందోళనలతో అమెరికా మళ్లీ భగ్గుమంది. ఈసారి జరిగిన హింసలో ఏకంగా పోలీసులే బలయ్యారు. డల్లాస్‌లో స్నైపర్లు బరితెగించారు. అమెరికా పోలీసులను టార్గెట్ చేశారు. ఆ కాల్పుల్లో నలుగురు పోలీసులు చనిపోయారు. మొత్తం 11 మంది పోలీసులను స్నైపర్లు షూట్ చేశారు. ఇటీవల అమెరికాలో నల్లజాతీయలపై వరుస దాడులు జరిగాయి. మిన్నసొట్టా, లూసియానాలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు నల్లజాతీయులు మృత్యువాతపడ్డారు. ఆ కాల్పులకు నిరసనగా డల్లాస్‌లో భారీ ఆందోళన చేపట్టారు. అయితే ఆ నిరసన ప్రదర్శనలో భారీ హింస చోటుచేసుకున్నది. ర్యాలీ తీస్తున్న ఆందోళనకారులు పోలీసుల ఫైరింగ్‌తో చెల్లాచెదురయ్యారు. ఈ దశలో స్నైపర్లు పోలీసులను టార్గెట్ చేశారు. రహస్య స్థావరాల నుంచి దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారు. మొత్తం 11 మంది పోలీసులకు తూటాలు దిగగా, అందులో నలుగురు ప్రాణాలు విడిచారు.
పోలీసులను కాల్చి చంపిన వాళ్ల కోసం తీవ్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గడిచిన వారం మిన్నసొట్టాలో ఫిలాండో కాసిల్, లూసియానాలో ఆల్టన్ స్టిర్లింట్ అనే నల్లజాతీయులు పోలీసుల తూటాలకు ప్రాణాలు విడిచారు. ఆ కాల్పులకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఆఫ్రికా-అమెరికా జాతికి చెందిన ప్రజలపై స్థానిక పోలీసులు అనేక సందర్భాల్లో బలప్రయోగం ప్రదర్శిస్తున్నారు. అయితే ఇద్దరు నల్లజాతీయులను కాల్చి చంపిన సంఘటనకు సంబంధించిన వీడియోలను ఆందోళనకారులు రిలీజ్ చేశారు. దాంతో దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. నల్లజాతీయులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నట్లు దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. నల్లజాతీయులను శ్వేతజాతి పోలీసులే టార్గెట్ చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపైన ఒబామా స్పందించారు. పోలీస్ శాఖలో జాతివివక్ష భేదాలు సమసిపోవాలని ఆయన పిలుపునిచ్చారు. కేవలం చర్మ వర్ణం కారణంగానే నల్లజాతీయులను వేరు చేస్తే అది వాళ్లను బాధిస్తుందని ఒబామా అన్నారు. డాల్లస్ లో కాల్పులకు దిగిన స్నైపర్ల ఫోటోలను పోలీసులు రిలీజ్ చేశారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







