కువైట్‌లో కొత్త ట్రాఫిక్ చట్టం అమలు..భారీ జరిమానాలు..!!
- April 23, 2025
కువైట్: 2025 శాసనసభ డిక్రీ నంబర్ 5 ప్రకారం..కొత్త ట్రాఫిక్ చట్టాన్ని అమలు చేయడంతో కువైట్ రోడ్డు భద్రతా ప్రయత్నాలలో ఒక ప్రధాన మార్పు ప్రారంభమైంది. పెరుగుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలు, ప్రమాదాలను పరిష్కరించడానికి ఈ చట్టం కఠినమైన జరిమానాలు, పోలీసులకు విస్తృత అధికారాలను కల్పించారు.
వికలాంగుల కోసం కేటాయించిన ప్రదేశాలలో వాహనాన్ని నడపడం లేదా పార్కింగ్ చేయడం చేస్తే KD 150 జరిమాన విధిస్తారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌ను ఉపయోగించడం వల్ల ఇప్పుడు KD 75 ఖర్చవుతుంది. సీట్ బెల్ట్ ధరించకపోతే KD 30 జరిమానా విధించబడుతుంది. గంటకు 50 కి.మీ కంటే ఎక్కువ వేగ పరిమితిని దాటిన లేదా నిర్లక్ష్యంగా వాహనం నడిపిన డ్రైవర్లను ఇప్పుడు అక్కడికక్కడే అరెస్టు చేసే అధికారాన్ని కల్పించారు.
మద్యం సేవించి వాహనం నడిపేవారిని, చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారిని లేదా అక్రమ టాక్సీ సర్వీసుల వంటి అనుమతి లేని కార్యకలాపాలకు వాహనాలను దుర్వినియోగం చేసేవారిని అరెస్టు చేయడానికి కూడా ఈ చట్టం పోలీసులకు అధికారం కల్పించింది.
తాజా వార్తలు
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్
- టాటా, ఇన్ఫోసిస్ కంపెనీలకు H-1B వీసా షాక్
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!







