భార్యతో కలిసి సెలవులకు వెళ్లగా.. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో దుబాయ్ ప్రవాసి మృతి..!!
- April 24, 2025
యూఏఈ: మంగళవారం పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన 26 మందిలో దుబాయ్‌లో నివసిస్తున్న, పనిచేస్తున్న 33 ఏళ్ల భారతీయ ప్రవాసి కూడా ఉన్నట్లు గుర్తించారు. అతని మరణాన్ని దగ్గరి బంధువు ధృవీకరించారు. ఫైనాన్స్ ప్రొఫెషనల్ అయిన నీరాజ్ ఉధ్వాని తన భార్యతో కలిసి సెలవులకు కాశ్మీర్ వెళ్లాడు. ఈ జంట హిమాచల్ ప్రదేశ్‌లో స్నేహితుడి వివాహం కోసం భారతదేశానికి వెళ్లినట్లు మృతుడి బంధువు తెలిపారు.
నీరాజ్ జైపూర్‌కు చెందినవాడు. చాలా కాలంగా దుబాయ్‌లో నివసిస్తున్నాడు. అతను ఇండియన్ హై స్కూల్‌లో పూర్వ విద్యార్థి. అతను నగరంలోని కాగ్నిటా స్కూల్ గ్రూప్‌లో ఫైనాన్స్ ప్రొఫెషనల్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.
“నీరాజ్ రెండేళ్ల క్రితం రాజస్థాన్‌లో వివాహం చేసుకున్నాడు. మినా రోడ్ వాస్ల్ కమ్యూనిటీలో నివసిస్తున్నాడు. అతని మృతదేహాన్ని ఇప్పుడు జైపూర్‌కు తరలిస్తున్నారు. అక్కడ అంత్యక్రియలు జరిగాయి.” అని బంధువు తెలిపారు. కాగా, నీరాజ్ స్నేహితులు కొంతమంది కూడా వివాహం కోసం భారతదేశానికి వెళ్లి ఆ తర్వాత తిరిగి వచ్చారని చెప్పారు. నీరాజ్ జంట మాత్రం సెలవుల కోసం పహల్గామ్‌కు వెళ్లి ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారని నీరజ్ స్నేహితులు వాపోయారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







