పాకిస్థాన్ తో అన్ని సంబంధాలు కట్–భారత్ సంచలన నిర్ణయాలు
- April 24, 2025
జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్‌లోని అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ అత్యంత కఠినమైన నిర్ణయాలను తీసుకుంది.ఈ దాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం, మరికొంతమంది తీవ్రంగా గాయపడడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఉగ్రదాడికి పాల్పడిన వారికి పాక్ సంబంధాలు ఉన్నాయన్న అనుమానాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ కమిటీ భేటీలో పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
పాకిస్థాన్‌తో పూర్తిగా దౌత్య సంబంధాలు పూర్తిగా కట్
ఈ నిర్ణయాల ప్రకారం, భారత్ తన దౌత్య సంబంధాలను పాకిస్థాన్‌తో పూర్తిగా తెంచుకుంది. పాక్‌కు చెందిన పౌరులు, పర్యాటకులు రెండు రోజుల్లో తమ దేశానికి వెళ్లిపోవాలని విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై పాకిస్థాన్ పౌరులకు భారత్‌లో ప్రవేశం పూర్తిగా నిషేధించబడింది. అంతేగాక, అటారీ చెక్‌పోస్టును తక్షణమే మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. పాక్ హైకమిషనర్‌ను కూడా భారత్ విడిచిపోవాలని సూచించడం, రెండు దేశాల మధ్య ఉన్న ఇండస్ జల ఒప్పందాన్ని నిలిపివేయడమూ భారత దిగ్గజ నిర్ణయాల్లో భాగంగా నిలిచాయి.
పహల్గాం దాడి పిరికిపంద చర్య
ఈ చర్యలపై విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టతనిచ్చారు. పహల్గాం దాడి పిరికిపంద చర్యగా ప్రపంచ దేశాల తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. భారత్ ఈ దాడికి తగిన బదులు ఇచ్చే దిశగా ముందుకెళ్తోందని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. త్వరలోనే ఉగ్రవాదుల పైనా, వాటికి మద్దతిచ్చే దేశాలపైనా ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచే విధంగా భారత్ చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!