భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ లు ఉండవు: BCCI
- April 25, 2025
పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.అంతేకాక పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీనిపై భారత్ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇదో పిరికిపంద చర్యగా, హేయమైన చర్యగా అభివర్ణించాయి.ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే పాకిస్థాన్ కు చెక్ పెట్టేందుకు 5 సంచలన నిర్ణయాలు తీసుకుని పాకిస్థాన్ కు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ కొట్టింది.అయితే ఈ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ లు ఉండబోవని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.ఈ నిర్ణయంతో భారత్ పాక్ మధ్య పోరు చూడాలనే ఫ్యాన్స్ కు కొంత నిరాశ అనే చెప్పొచ్చు.
ఉగ్రదాడి
భారత్-పాకిస్థాన్ మధ్య చివరగా 2012-13లో ద్వైపాక్షిక సిరీస్ జరిగింది.అప్పటి నుంచి కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఇరు దేశాలు తలపడుతూ వచ్చాయి. అయితే తాజా సంఘటనలతో ఇక భవిష్యత్తులోనూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుందని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు.భారత్- పాక్ మధ్య చివరి ద్వైపాక్షిక సిరీస్ 2012-13లో జరిగింది. అంతకంటే నాలుగేళ్ల ముందే ముంబై ఉగ్రదాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. కానీ అప్పటి యూపీఏ ప్రభుత్వం క్రికెట్ కు అడ్డుచెప్పలేదు. ఇక రెండు నెలల క్రితం జరిగిన చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చింది. కానీ, ఆ టోర్నీకి భారత్ వెళ్ల లేదు.దుబాయ్ లో మ్యాచ్ లు ఆడి అక్కడే టైటిల్ కొట్టింది.
భద్రత
ఈ వ్యాఖ్యలు నేపథ్యంలో, భారత మహిళల జట్టు, పాకిస్తాన్ మహిళల జట్టు మధ్య వచ్చే ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఈ ఉదంతం ప్రభావం ఎలా ఉంటుందో, రెండు బోర్డులు దీన్ని ఎలా సమర్థంగా ఎదుర్కొంటాయో అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. దేశ భద్రతకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తూనే, క్రీడా సంబంధాల్లో కూడా కఠినమైన వైఖరిని పాటించాల్సిన అవసరం ఉందని రాజీవ్ శుక్లా వ్యాఖ్యలు బలంగా సూచిస్తున్నాయి. ఈ సంఘటనల నేపథ్యంలో పాక్‌తో క్రికెట్ సంబంధాలు కొనసాగించరాదన్న నిర్ణయం పై బీసీసీఐ స్పష్టత ఇచ్చినట్లు కనిపిస్తోంది.
తాజా వార్తలు
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్‌కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!







