రేపే పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు..పాల్గొననున్న భారత రాష్ట్రపతి
- April 25, 2025
న్యూఢిల్లీ: వాటికన్ సిటీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బయలుదేరి వెళ్లారు. ఈ నెల 26వ తేదిన జరిగే పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో ఆమె పాల్గొనున్నారు. ముర్ముతో పాటు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా వెళ్లారు.వాటికన్ వెళ్తున్న బృందంలో కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్, గోవా డిప్యూటీ స్పీకర్ పీటర్ డిసౌజా ఉన్నారు. భారత ప్రభుత్వం, ప్రజల తరపున సంతాపం తెలియజేయనున్నారు. వాటికన్‌లోని సెయింట్ పీటర్ బాలిసికా వద్ద పుష్పగుచ్చం ఉంచి పోప్ ఫ్రాన్సిస్‌కు ముర్ము నివాళి అర్పిస్తారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరగనున్న సామూహిక ప్రార్థనల్లోనూ ఆమె పాల్గొననున్నారు. ఇక అంత్యక్రియలు జరిగే 26వ తేదిన సంతాప దినంగా పాటించనున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!