బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..డ్రైవర్ కు BD49,500 ఫైన్..!!

- April 27, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..డ్రైవర్ కు BD49,500 ఫైన్..!!

మనామా: ఓ డ్రైవర్ తెల్లవారుజామున షిఫ్ట్ సమయంలో సిగ్నల్ జంప్ చేసి ముగ్గురు రోడ్ వర్కర్లపైకి దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి మొత్తం BD49,500 పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.  ఆసియన్ జాతీయులైన కార్మికులు అందరూ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రోడ్డులో కొంత భాగాన్ని తవ్వుతుండగా జరిగిన ఈ ప్రమాదానికి డ్రైవర్ పూర్తిగా బాధ్యుడని హై సివిల్ కోర్టు నిర్ధారించింది.

కోర్టు ఫైల్స్ ప్రకారం, డ్రైవర్ సిగ్నల్‌ను జంప్ చేసి, చట్టబద్ధంగా గ్రీన్ లైట్ దాటుతున్న మరొక వాహనాన్ని ఢీకొట్టి, ఆపై దారి తప్పి, కార్మికులపైకి దూసుకెళ్లింది.  మరణించిన కార్మికుడి కుటుంబానికి BD36,000, ప్రాణనష్టానికి BD15,000లతోపాటు ఆర్థిక నష్టాలకు BD21,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని మృతుని తల్లి, భార్య, చిన్న కుమార్తె మధ్య సమానంగా విభజించాలని, వారు పూర్తిగా అతని ఆదాయంపై ఆధారపడి ఉన్నారని కోర్టు తన తీర్పులో వెల్లడిచింది. గాయపడ్డ ఒక కార్మికునికి గాయాలకు BD17,500, వైద్య ఖర్చులు ఇతర ఖర్చుల కోసం BD1,000 లభించింది. మూడవ కార్మికుడు BD3,500 పరిహారం అందుకున్నాడు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com