తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..
- April 27, 2025
తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు వచ్చిన సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్తుంటారు. దీంతో ప్రతీ వేసవికాలం సెలవుల్లో రెండు నెలలు తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ‘‘వేసవికాలం రెండు నెలలు వీఐపీ, సిఫార్సు లేఖలపై దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ బోర్డు సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. మే, జూన్ రెండు నెలలపాటు సెలవుల నేపథ్యంలో కుటుంబాలతో తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, భక్తులు ఇబ్బందులు పడకూదడనే ఉద్దేశంతోనే మే 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు వీఐపీ దర్శనాలతో పాటు సిఫార్సు లేఖలపై సేవలు, బ్రేక్ దర్శనాలు, సుప్రభాతం దర్శనాలు రద్దు చేస్తున్నట్లు జ్యోతుల నెహ్రూ తెలిపారు.’’
వేసవి సెలవులు, వారాంతం నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. సర్వదర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులతో శ్రీవారి మెట్టు మార్గంలో శనివారం తెల్లవారు జామునుంచే ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తిరుమలకు వెళ్లే వాహనాలు గరుడ సర్కిల్ వరకు బారులు తీరాయి.
మరోవైపు.. జమ్మూకశ్మీర్ లో ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో పోలీసులు, బాంబ్ స్వ్కాడ్ బృందాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. జీఎన్సీ టోల్ గేట్, అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గం ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. భక్తుల పూర్తి వివరాలు తెలుసుకోవడంతోపాటు.. వాహనాలు, భక్తుల లగేజీలను పరిశీలించి పంపుతున్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!