హైద్రాబాద్ లో దొరికిన మరో ఐఎస్ఐఎస్ సానుభూతి పరుడు
- July 08, 2016
బంగ్లాదేశ్ లో పేలుళ్లకు పాల్పడి పలువురి ప్రాణాలు బలిగొన్న ఐఎస్ఐఎస్ తదుపరి లక్ష్యం భారతదేశమేనా? ప్రధానంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో తమ సానుభూతిపరుల ద్వారా ఉగ్రదాడులు చేయించడానికి ఐఎస్ పావులు కదుపుతోందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. తాజాగా హైదరాబాద్ నగరంలోని సంతోష్ నగర్ ప్రాంతంలో మరో ఐసిస్ సానుభూతిపరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈదీబజార్ ప్రాంతానికి చెందిన నిజాముద్దీన్ గా ఆ సానుభూతిపరుడిని గుర్తించారు. అతడిని విచారణ నిమిత్తం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కార్యాలయానికి తరలించారు.ఇటీవలే కేంద్ర నిఘా విభాగం నుంచి అందిన సమాచారం ఆధారంగా ఎన్ఐఏ వర్గాలు హైదరాబాద్ పాతబస్తీలోని పలు ప్రాంతాలలో సోదాలు చేసి ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో సానుభూతిపరుడిని అదుపులోకి తీసుకోవడంతో నగరంలో ఐసిస్ వేళ్లూనుకోడానికి ప్రయత్నిస్తోందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







