అక్కడ సౌర విద్యుత్తు కేవలం 2.20 రూపాయలే.!
- July 08, 2016
దుబాయ్‌లో సౌరవిద్యుత్ ఉత్పాదన చేసేందుకు ఉత్పత్తిదారులు యూనిట్‌కు రూ. 2.2కే (2.99సెంట్లు) ముందుకురావడం రికార్డు సృష్టించింది. అయితే భారత్‌లో మాత్రం ఇంత తక్కువకు ఉత్పత్తిదారులు ఎందుకు ముందుకు రావడం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది. రాజస్థాన్‌లో 70 మెగావాట్ల సౌరవిద్యుత్ కేంద్రానికి ఫిన్లాండ్కు చెందిన ఒక కంపెనీ యూనిట్‌కు రూ. 4.34తో టెండర్ దాఖలు చేసింది. మనదేశంలో ఇదే అత్యంత తక్కువ ధర కావడం గమనార్హం. దీనిపై విద్యుత్ రంగనిపుణులు విశ్లేషిస్తూ దుబాయ్‌లో పన్ను రాయితీలు భారీగా వుంటాయని తెలిపారు. దీంతో పాటు అక్కడ ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువ కావడంతో ఒక మెగావాట్ ప్లాంట్ 20 లక్షల యూనిట్ల విద్యుత్‌ను తయారుచేస్తుందని అదే భారత్‌లో మాత్రం 16 లక్షల యూనిట్లు మాత్రమేనన్నారు. దుబాయ్ ప్రభుత్వం అక్కడ సౌరవిద్యుత్ కేంద్రాలకు భారీ రాయితీలు కల్పించడం కూడా అక్కడ సౌరవిద్యుత్ చవక ధరలో ఉత్పత్తి చేసేందుకు దోహదపడుతోందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







