యూపీఐ కొత్త రూల్స్..యూజర్లకు బిగ్ రిలీఫ్..

- April 30, 2025 , by Maagulf
యూపీఐ కొత్త రూల్స్..యూజర్లకు బిగ్ రిలీఫ్..

యూపీఐ యూజర్లకు బిగ్ రిలీఫ్. కోట్లాది మంది వినియోగదారులు యూపీఐ అకౌంట్లనే ఉపయోగిస్తున్నారు. యూపీఐ కొత్త రూల్స్ అతి త్వరలో అమల్లోకి రానున్నాయి. ఇక పై యూపీఐ పేమెంట్లు చేసే సమయంలో ఎలాంటి పొరపాటు జరగదు. చాలా మంది యూజర్లు పొరపాటున ఒకరికి డబ్బులు పంపబోయి మరొకరికి పంపుతుంటారు.

రాబోయే కొత్త రూల్ ప్రకారం.. యూపీఐ పేమెంట్ల విషయంలో ఎవరికి పంపుతారో వారి పేరు మాత్రమే కనిపిస్తుంది. తప్పుగా మరో వ్యక్తికి డబ్బులు పంపే అవకాశం ఉండదు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తరచుగా వినియోగదారుల ప్రయోజనాల కోసం అనేక మార్పులు చేస్తోంది. మోసాలను అరికట్టడానికి NPCI కొత్త నిబంధనలు తీసుకొస్తోంది.

కొత్త నిబంధనల ప్రకారం.. లబ్ధిదారుని గుర్తింపు లేకుండా యూపీఐ పేమెంట్ ఇకపై సాధ్యం కాదు. ప్రస్తుతం, చాలా లావాదేవీలు యూపీఐ నంబర్ లేదా వర్చువల్ ఐడీ ద్వారా జరుగుతాయి. ఇలాంటి పరిస్థితిలో పేమెంట్ చేస్తున్న వ్యక్తికి పేమెంట్ స్వీకరించే యూజర్ ఎవరు అనేది తెలియదు. కానీ, ఇకపై అలా కాదు..

ఇప్పుడు UPI యాప్‌లో పేమెంట్ చేసే ముందు కస్టమర్ లబ్ధిదారుడి పేరును మాత్రమే చూస్తారు. ఇటీవల NPCI కూడా ఈ విషయంలో ఒక సర్క్యులర్ జారీ చేసింది. P2P, P2PM లావాదేవీలకు కొత్త రూల్ జూన్ 30, 2025 వరకు వర్తిస్తుంది.

యూపీఐలో కొత్త ఫీచర్ ఇదే:
NPCI జారీ చేసిన నోటిఫికేషన్‌లో యూపీఐ అప్లికేషన్‌లు లావాదేవీకి ముందు వివరాల పేజీలో లబ్ధిదారుడి పేరు (బ్యాంకింగ్ నేమ్) మాత్రమే వినియోగదారుకు కనిపిస్తుంది. QR కోడ్ నుంచి సేకరించిన పేర్లు, చెల్లింపుదారు పేరు లేదా ఏదైనా ఇతర యాప్‌లోని చెల్లింపుదారులకు కనిపించవని ఎన్‌పీసీఐ పేర్కొంది.

ఇక పై యాప్‌లో బ్యాంక్ రిజిస్టర్డ్ పేర్లు:
భారత్‌లో అన్ని బ్యాంకులు కస్టమర్ డేటాబేస్, అకౌంట్ సమాచారాన్ని స్టోర్ చేసేందుకు కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ (CBS)ను ఉపయోగిస్తాయి. తద్వారా రియల్ టైమ్ లావాదేవీలను పూర్తి చేయొచ్చు. లబ్ధిదారుని పేరు అంటే.. చెల్లింపుదారుడి బ్యాంకు అధికారిక రికార్డులు, డేటాబేస్‌లో రిజిస్టర్ అయిన పేరు కనిపిస్తుంది. ఈ పేరు అధీకృత బ్యాంకింగ్ API ద్వారా అందిస్తుంది. ఇందులో వినియోగదారులు లేదా యాప్‌లు పేర్లను మార్చేందుకు అనుమతి ఉండదు.

మోసాలకు చెక్ పడినట్టే..:
ప్రస్తుతం యూపీఐ లావాదేవీ సమయంలో కనిపించే పేర్లతో ఎక్కువగా మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మోసగాళ్ళు ఫేక్ డిస్‌ప్లే పేర్లను క్రియేట్ చేసి వినియోగదారులను మోసం చేయవచ్చు. జూన్ 30 నుంచి అన్ని బ్యాంక్-రిజిస్టర్డ్ పేర్లు మాత్రమే కనిపిస్తాయి.

యూపీఐ లావాదేవీల సమయంలో కాంటాక్ట్ లిస్ట్‌లో మారుపేర్లు లేదా మాన్యువల్‌గా సేవ్ చేసిన పేర్లు కనిపించవు. యాప్ ఇంటర్‌ఫేస్‌లో పేమెంట్ల కోసం లబ్ధిదారుడి పేరుని మార్చేందుకు అనుమతించే అన్ని ఫీచర్లను యూపీఐ యాప్స్ నిలిపివేస్తాయని NPCI పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com