ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- March 12, 2026
అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో గురువారం రెండోరోజు కలెక్టర్ల సదస్సు కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఫారెస్ట్ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. వైల్డ్ లైఫ్ సాంక్చురీ పేరుతో అభివృద్ధి పనులు ఆపడం సరైంది కాదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక సౌకర్యాలకు కూడా అడ్డంకులు సృష్టించడం తగదని అన్నారు.
ప్రభుత్వం ఆమోదించిన ఇళ్లకు కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవ్వకపోవడం ఏమిటని సీఎం చంద్రబాబు నాయుడు అటవీ అధికారులను ప్రశ్నించారు. గిరిజనులకు నీరు, రహదారి, విద్యుత్ వంటి కనీస సదుపాయాలు కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే ఉన్న రహదారిపై గ్రావెల్ లేదా మెటల్ వేయడానికీ అభ్యంతరం చెప్పడం ఎందుకని సీఎం చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు. అధికారుల వ్యవహారశైలి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం.. ఫారెస్ట్ అధికారుల తీరువల్లే ఇబ్బందులు పెరుగుతున్నాయని అన్నారు. మీ ఆటిట్యూడ్ అబ్జెక్షనబుల్.. మీపై చాలా కంప్లైంట్లు వస్తున్నాయి అంటూ సీఎం చంద్రబాబు అన్నారు.
సమస్యలు ఉంటే నేరుగా తనకు లేదా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తెలియజేయాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించవద్దని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు కలెక్టర్, డీఎఫ్‌వో కలిసి సమస్యలకు పరిష్కారం కనుగొనాలని సూచించారు. అభివృద్ధి పనులు ఆగిపోకుండా సమన్వయంతో ముందుకు సాగాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







