అక్కడ సౌర విద్యుత్తు కేవలం 2.20 రూపాయలే.!

- July 08, 2016 , by Maagulf
అక్కడ సౌర విద్యుత్తు కేవలం 2.20 రూపాయలే.!

దుబాయ్‌లో సౌరవిద్యుత్‌ ఉత్పాదన చేసేందుకు ఉత్పత్తిదారులు యూనిట్‌కు రూ. 2.2కే (2.99సెంట్లు) ముందుకురావడం రికార్డు సృష్టించింది. అయితే భారత్‌లో మాత్రం ఇంత తక్కువకు ఉత్పత్తిదారులు ఎందుకు ముందుకు రావడం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది. రాజస్థాన్‌లో 70 మెగావాట్ల సౌరవిద్యుత్‌ కేంద్రానికి ఫిన్‌లాండ్‌కు చెందిన ఒక కంపెనీ యూనిట్‌కు రూ. 4.34తో టెండర్‌ దాఖలు చేసింది. మనదేశంలో ఇదే అత్యంత తక్కువ ధర కావడం గమనార్హం. దీనిపై విద్యుత్‌ రంగనిపుణులు విశ్లేషిస్తూ దుబాయ్‌లో పన్ను రాయితీలు భారీగా వుంటాయని తెలిపారు. దీంతో పాటు అక్కడ ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువ కావడంతో ఒక మెగావాట్‌ ప్లాంట్‌ 20 లక్షల యూనిట్ల విద్యుత్‌ను తయారుచేస్తుందని అదే భారత్‌లో మాత్రం 16 లక్షల యూనిట్లు మాత్రమేనన్నారు. దుబాయ్‌ ప్రభుత్వం అక్కడ సౌరవిద్యుత్‌ కేంద్రాలకు భారీ రాయితీలు కల్పించడం కూడా అక్కడ సౌరవిద్యుత్‌ చవక ధరలో ఉత్పత్తి చేసేందుకు దోహదపడుతోందని వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com