శర్వా38 టైటిల్ 'భోగి' షూటింగ్ ప్రారంభం
- April 30, 2025చార్మింగ్ స్టార్ శర్వా, బ్లాక్ బస్టర్ మేకర్ సంపత్ నంది ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ #శర్వా38 కోసం ఫస్ట్ టైమ్ కలిసి వర్క్ చేస్తున్నారు.ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. 1960 బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది. ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ స్పార్క్ అనే పవర్ ఫుల్ కాన్సెప్ట్ వీడియో ద్వారా రివిల్ చేశారు.
దర్శకుడు సంపత్ నంది విధి, పోరాటం, మార్పు అనే కథను నరేట్ చేస్తుండగా ఈ వీడియో సినిమా ఎసెన్స్ చూపిస్తుంది. శర్వా ఆ కథను ఆసక్తిగా వింటూ, ధైర్యం, యుద్ధాలతో నిండిన ఒక ప్రపంచాన్ని ఊహించుకుంటాడు. కీలక ఘట్టంగా ఒక ఖడ్గం ప్రయాణం మొదలవుతుంది. అలా 'భోగి' టైటిల్ రివిల్ అవుతుంది. ఈ టైటిల్ కొత్త శక్తి, తిరుగుబాటును ప్రజెంట్ చేస్తోంది. వీడియోలో ప్రజెంట్ చేసినట్లుగా శర్వా నెవర్ బిఫోర్ పాత్రలోకి అడుగుపెడుతున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లో నిర్మించిన భారీ సెట్లో గ్రాండ్ స్కేల్ లో ప్రారంభమైయింది. వీటిలో కొన్ని భాగాలను కాన్సెప్ట్ వీడియోలో ప్రజెంట్ చేశారు. ఈ విజన్ ని జీవం పోయడానికి ప్రొడక్షన్ టీం ఆరు నెలలు డెడికేషన్ తో వర్క్ చేసి, దాదాపు 20 ఎకరాల భూమిని బ్రెత్ టేకింగ్ బ్యాక్ డ్రాప్ గా మార్చింది.
ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
1960ల ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర ప్రాంతంలో వింటేజ్ సెట్టింగ్ తో 'భోగి' టెక్నికల్ గా నెక్స్ట్ లెవల్ లో ఉండబోతోంది. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్ కాగ, సినిమాటోగ్రాఫర్, సంగీత దర్శకుడు, ఎడిటర్‌ను త్వరలోనే అనౌన్స్ చేస్తారు.
భోగి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి
సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాత: కేకే రాధామోహన్
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
సమర్పణ: లక్ష్మీ రాధామోహన్
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







