సౌదీ అరేబియాలో జిమ్‌లు, స్పోర్ట్స్ సెంటర్లకు తుది గడువు..!!

- November 07, 2026 , by Maagulf
సౌదీ అరేబియాలో జిమ్‌లు, స్పోర్ట్స్ సెంటర్లకు తుది గడువు..!!

రియాద్: సౌదీ అరేబియాలోని ప్రైవేట్ జిమ్‌లు, స్పోర్ట్స్ సెంటర్లు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన స్థానికీకరణ (సౌదీ జాతీయులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం) నిబంధనలను నవంబర్ 18లోగా పూర్తి చేయాలని మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ గడువుకు మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో సంస్థలు ముందస్తుగా సిద్ధం కావాలని కోరింది. 

ప్రైవేట్ రంగంలో ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో సౌదీ పౌరుల నియామకాలను పెంచే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిబంధనల అమలును కార్మిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా క్రీడా మంత్రిత్వ శాఖ పర్యవేక్షించనుంది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు, సహాయ కార్యక్రమాలను అందించనుంది. ఉద్యోగుల నియామకం, శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పనతోపాటు ఉద్యోగాల్లో కొనసాగించే విషయంలోనూ సహకారం అందించనున్నారు.

అలాగే మానవ వనరుల అభివృద్ధి నిధి (HRDF - హదఫ్) ద్వారా అమలు చేస్తున్న స్థానికీకరణ ప్రోత్సాహక పథకాలు, కార్యక్రమాలకు ప్రైవేట్ సంస్థలకు ప్రాధాన్యత కల్పించనున్నారు. నిబంధనలు, అమలు విధానం, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక మార్గదర్శకాలను పరిశీలించాలని మంత్రిత్వ శాఖ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com