రథయాత్ర 2025 శ్రీ జగన్నాథ్ ధామ్ నుండి చెక్క పని నిర్మాణం..పూరి ధామ్
- May 01, 2025
జగన్నాథుడు అనగానే ముందుగా గుర్తొచ్చేది రథం.అయితే స్వామి వారు ప్రయాణించే రథాలు కూడా చాలా ప్రత్యేకంగా తయారు చేయబడి ఉంటాయి.ఈ రధాన్ని ఎక్కువగా వేప చెట్టు యొక్క చెక్కతో మాత్రమే తయారు చేయబడుతుంది. మరే ఇతర లోహాలను వినియోగించరు. పవిత్రమైన వృక్షాల చెక్కను ఉపయోగించి చేస్తారు.జగన్నాథుడి రథం మొత్తం 16 చక్రాలతో ఎంతో ప్రత్యేకంగా తయారు చేయబడుతుంది.
మరో వింత విషయం ఏమిటంటే, జగన్నాధుని విగ్రహానికి కానీ, ఆయన సోదరుడు అయినటువంటి బలరాముడు మరియు సోదరి సుభద్ర విగ్రహాలకు కానీ చేతులు, కాళ్లు, పంజాలు ఏమీ ఉండవు. ఇలా లేకపోవడానికి వెనుక ఒక పెద్ద పౌరాణిక చరిత్ర ఉంది. ప్రాచీన కాలంలో విశ్వకర్మ విగ్రహాలను తయారు చేసే వారట, అలా ఓ నాడు జగన్నాధుని, ఆయన సోదరుని, సోదరి విగ్రహాలు ఒక గదిలో తయారు చేస్తున్న సమయంలో ఆ ప్రాంతం యొక్క రాజు గది తలుపులు తెరిచి లోపలికి రావడంతో మధ్యలోనే నిలిపి వేసాడట విశ్వకర్మ. అప్పటికింకా పాదాలు, చేతులు పూర్తి కాలేదట...ఇక అప్పటినుండి అదే ఆచరణ కొనసాగుతోంది.
ఇక ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..సాధారణంగా అన్ని ఆలయాల ఆవరణలో పక్షులు ఎగరడం గుమికూడడం వంటివి చూస్తుంటాం. కానీ పూరి జగన్నాథుని ఆలయం మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం.ఇక్కడ దేవాలయంపై నుండి ఒక పక్షి కూడా ఇప్పటివరకు ఎగరడం ఎవరూ చూసింది లేదు.ఈ దేవాలయ ఆవరణలో పక్షులు అసలు ఉండవు. అంతే కాకుండా ఈ దేవాలయానికి పై నుండి విమానాలు సైతం వెళ్లవు ఎందుకంటే ఈ ఆలయానికి అయస్కాంత శక్తి ఉందని చెబుతుంటారు. పూరి జగన్నాథ్ మందిరం పై ఎప్పుడూ ఒక జెండా ఉంటుంది. అయితే ఇది గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో ఎగురుతూ అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. కాని దీని వెనకున్న కారణాలు ఏమిటి అన్న వివరాలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి.ఇలా ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!