ఏపీలో యువతకు విదేశాల్లో ఉద్యోగాలు..
- May 01, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ యువతకు మంచి అవకాశం కల్పించింది. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.
దీని కోసం కూటమి ప్రభుత్వం శిక్షణ ఇస్తోంది.
గతంలో, జర్మనీ వెళ్లాలంటే ఏం చేయాలో, ఎక్కడ శిక్షణ తీసుకోవాలో, ఎవరిని సంప్రదించాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడేవారు.ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి రాష్ట్రంలోని నర్సింగ్ విద్యార్థులకు శిక్షణ ఇప్పించి జర్మనీలో ఉద్యోగాలు పొందేలా ఏర్పాట్లు చేసింది.
ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. నర్సులకు శిక్షణ ఇవ్వడానికి ఒక ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు.గుంటూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను శిక్షణ కేంద్రంగా ఎంపిక చేశారు.రాత, మౌఖిక పరీక్షల ద్వారా కోస్తాంధ్ర ప్రాంతం నుంచి 22 మందిని ఎంపిక చేశారు. గత ఏడాది డిసెంబర్ 11 నుండి శిక్షణ ప్రారంభమైంది.
శిక్షణలో జర్మన్ భాషలో A1, A2, B1, B2 స్థాయిలలో నైపుణ్యం సాధించాలి. ఇప్పటికే A1, A2, B1 పరీక్షలు పూర్తికాగా..వారికి చెన్నైలో B2 పరీక్ష నిర్వహిస్తారు.ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో మౌఖిక పరీక్ష ఉంటుంది.దీనిలో ఉత్తీర్ణత సాధిస్తే జర్మనీలో ఉద్యోగానికి ఎంపకైనట్లు లెక్క..అలా ఎంపికైనా వారికి విమాన టికెట్లు, వీసా, ధ్రువపత్రాలు అన్నీ ఉచితంగా అందిస్తారు. వీరికి నెలకు రూ.2.7 లక్షల నుంచి రూ.3.2 లక్షల వరకు శాలరీ ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ ఇచ్చి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని జర్మనీ పంపేందుకు ఏర్పాట్లు చేయడం ఆనందంగా ఉందని శిక్షణ తీసుకుంటున్నవారు చెబుతున్నారు. విదేశాల్లో నర్సులుగా ఉద్యోగాల కోసం వెళ్లేందుకు ఇది సువర్ణ అవకాశం అంటున్నారు.ఇది నిరుద్యోగులకు ఒక గొప్ప అవకాశం అంటున్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!