మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- May 01, 2025
టీ20 మహిళల ప్రపంచకప్ 2026 కి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయ్యింది.వచ్చే ఏడాది ఇంగ్లాంద్ వేదికగా జరగనున్న ఈ టోర్నీ షెడ్యూల్ ను ఐసీసీ ప్రకటించింది. మొత్తం 24 రోజుల పాటు కొనసాగనున్న ఈ టోర్నీలో 12 జట్లు కప్పు కోసం పోటీపడనున్నాయి.
2026 జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో మొత్తం 33 మ్యాచ్ లు జరగనుండగా.. జులై 5న లాడ్స్ వేదికగా ఫైనల్స్ జరగనుంది. కాగా..మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు లార్డ్స్ మైదానం ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.
లార్డ్స్‌తో పాటు, మరో ఆరు వేదికలు కూడా ఈ టోర్నమెంట్ కోసం కేటాయించబడ్డాయి. ఓల్డ్ ట్రాఫోర్డ్, హెడింగ్లీ, ఎడ్జ్‌బాస్టన్, హాంప్‌షైర్ బౌల్, ది ఓవల్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ 2026 మహిళల T20 ప్రపంచ కప్‌ను ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తున్న ఐసిసి ప్రపంచ కప్ ఎడిషన్ లో లార్డ్స్‌లో ఫైనల్ నిర్వహించడం ఇది మూడోసారి. లాడర్స్ వేదికగా 2017లో మహిళల ప్రపంచ కప్, 50 ఓవర్ల టోర్నమెంట్ కు.. 2019లో పురుషుల వన్డే ప్రపంచ కప్ కు ఇంగ్లండ్ ఆథిద్యమిచ్చింది. అయితే, ఈ రెండు సందర్భాలలోనూ ఇంగ్లాండ్ జట్టు విజేతగా నిలిచింది.
2017లో జరిగిన మహిళల ప్రపంచ కప్, 50 ఓవర్ల టోర్నమెంట్, లార్డ్స్‌లో ఫైనల్‌గా జరిగింది, అలాగే 2019లో పురుషుల వన్డే ప్రపంచ కప్ కూడా జరిగింది. యాదృచ్చికంగా, ఇంగ్లాండ్ రెండు సందర్భాలలోనూ విజేతగా నిలిచింది.
ఫార్మాట్ ఇలా..
మొత్తం 12 జట్లను రెండు గ్రూపులు విభజిస్తారు. ఒక్కొ గ్రూపులో ఆరు జట్లు ఉంటాయి. దీని తరువాత నాకౌట్ దశ ఉంటుంది. ఆ తరువాత ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
పాల్గొనే జట్లు ఇవే..
ఢిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్ తో పాటు.. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటికే ప్రపంచకప్‌లో తమ స్థానాలను నిర్థారించుకున్నాయి. మిగిలిన మరో నాలుగు జట్లను వచ్చే ఏడాది జరిగే క్వాలిఫయర్స్ ద్వారా ఎంపిక చేస్తారు.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్‌లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







