సౌదీ అరేబియాలో 10%కి పెరిగిన వైట్ ల్యాండ్ ట్యాక్స్..!!

- May 02, 2025 , by Maagulf
సౌదీ అరేబియాలో 10%కి పెరిగిన వైట్ ల్యాండ్ ట్యాక్స్..!!

రియాద్: సౌదీ అరేబియా వైట్ ల్యాండ్ పన్ను చట్టానికి సవరణలను ఆమోదించింది.  అభివృద్ధి చేయని భూమిపై వార్షిక లెవీని దాని విలువలో 2.5% నుండి 10%కి పెంచింది.  మొదటిసారిగా ఉపయోగంలో లేని లేకుండా దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న ఆస్తులపై వార్షిక పన్నును ప్రవేశపెట్టింది. పెరుగుతున్న రియల్ ఎస్టేట్ ధరలను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నందున,  ప్రాపర్టీ అభివృద్ధిని పెంచడం, గృహ సరఫరాను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాయని అధికార యంత్రాంగం తెలిపింది.


మున్సిపల్ మరియు గ్రామీణ వ్యవహారాలు, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ ప్రైవేట్ డెవలపర్‌లతో భాగస్వామ్యంతో వివిధ ప్రాంతాలలో గృహ యూనిట్లను అందించే ప్రణాళికలను ప్రకటించింది. వీటి ధర SR250,000,  SR1.2 మిలియన్ల మధ్య ఉంటుంది. ఈ సంవత్సరం సౌదీ గృహయజమానులను 66%కి పెంచడమే ఈ చొరవ లక్ష్యమని మంత్రి మజేద్ అల్-హోగైల్ ఇటీవల ప్రభుత్వ విలేకరుల సమావేశంలో తెలిపారు.

వైట్ ల్యాండులకు నిబంధనలు 90 రోజుల్లోపు జారీ అవుతాయని, ఖాళీగా ఉన్న ఆస్తి పన్నును నియంత్రించే నియమాలు ఒక సంవత్సరం లోపల ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. రియాద్‌లో రియల్ ఎస్టేట్ ధరల్లో పదునైన పెరుగుదలను మంత్రి అల్-హోగైల్ ధృవీకరించారు. అయితే క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆస్తి ధరలు పారిశ్రామిక, వ్యవసాయ, వాణిజ్య,  గృహాల వృద్ధికి అనుగుణంగా ఉండేలాఆదేశాలను జారీ చేశారని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com