కువైట్‌లో భారతీయ వంటమనిషికి మరణశిక్ష అమలు

- May 03, 2025 , by Maagulf
కువైట్‌లో భారతీయ వంటమనిషికి మరణశిక్ష అమలు

కువైట్ సిటీ: కువైట్‌లో యజమాని హత్య కేసులో దోషిగా తేలిన భారతీయ వంటమనిషికి మరణశిక్ష అమలైంది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన 38 ఏళ్ల ముస్తకీం భాతియారా అనే వంటమనిషి గత ఏడేళ్లుగా కువైట్‌లోని రెహానా ఖాన్ అనే మహిళ ఇంట్లో పని చేస్తున్నాడు. 2019లో ఆయనకు యజమానితో ఘర్షణ తలెత్తింది.ఈ వివాదం కత్తితో దాడికి దారి తీసి, ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోపణలు ఉన్నాయి.యజమాని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ముస్తకీంను పోలీసులు అరెస్ట్ చేశారు.విచారణ అనంతరం 2021లో న్యాయస్థానం అతనిని దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది.

ఈ ఏడాది ఏప్రిల్ 28న ముస్తకీంకు కువైట్‌లో శిక్ష అమలయ్యింది.భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ముస్తకీం కుటుంబానికి తెలియజేసింది.అనంతరం మృతదేహాన్ని స్వదేశానికి తరలించి, గుజరాత్‌లోని కపడ్‌వంజ్‌లో బుధవారం ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం ఖననం చేశారు. ముస్తకీం గతంలో దుబాయ్, బహ్రెయిన్ దేశాల్లో కూడా వంటమనిషిగా పని చేసిన అనుభవం ఉన్న వ్యక్తి.

వలస జీవులు ఎదుర్కొంటున్న ఒత్తిడి

ఈ ఘటనతో గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయ వలస కార్మికుల పరిస్థితులపై మరోసారి చర్చ మొదలైంది. వలస జీవులు ఎదుర్కొంటున్న ఒత్తిడి, పని ఒప్పందాల లోపాలు, మానవ హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై ప్రభుత్వాలు మరింత చొరవ చూపాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత వివాదాలు ఇలా ప్రాణాంతక పరిణామాలకు దారితీయకుండా ఉండేందుకు సమర్ధమైన మానవీయ వ్యవస్థలు అవసరం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com