ఇరాన్-అమెరికా మధ్య అణు చర్చలు వాయిదా..!!
- May 03, 2025
మస్కట్: ఇరాన్-అమెరికా మధ్య జరగాల్సి అణు చర్చలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు చర్చలకు మీడియేటర్ గా ఉన్న ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైది తెలిపారు. ఈ వారంలో జరగాల్సిన తాజా రౌండ్ "లాజిస్టికల్ కారణాల వల్ల" తరువాతి తేదీకి వాయిదా పడిందని సామాజిక వేదిక Xలో తెలిపారు. "లాజిస్టికల్ కారణాల వల్ల, మే 3వ తేదీ శనివారం జరగాల్సిన యూఎస్-ఇరాన్ సమావేశాన్ని మేము తిరిగి షెడ్యూల్ చేస్తున్నాము" అని ఆయన పేర్కొన్నారు. ఇరుపక్షాలతో సంప్రదించి కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. తాజాగా (శనివారం) చర్చలు రోమ్‌లో జరగాల్సి ఉంది. అయితే, బుధవారం పోప్ ఫ్రాన్సిస్ మరణం తర్వాత కొత్త పోప్‌ను ఎన్నుకోవడానికి వాటికన్ త్వరలో సమావేశాన్ని నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







