రష్యా దౌత్యవేత్తలను అమెరికా వెలివేసింది..

- July 09, 2016 , by Maagulf
రష్యా దౌత్యవేత్తలను అమెరికా వెలివేసింది..

అమెరికా, రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఇద్దరు రష్యా దౌత్యవేత్తలను అమెరికా వెలివేసింది. ఇటీవల మాస్కోలో అమెరికా దౌత్యవేత్తపై స్థానిక పోలీస్ దాడి చేశాడు. ఆ దాడికి నిరసనగా ఇద్దరు రష్యా దౌత్యవేత్తలను దేశం విడిచి వెళ్లాలని గత నెల 17వ తేదీన ఆదేశాలు జారీ చేసినట్లు అమెరికా ప్రభుత్వ కార్యాలయం స్పష్టం చేసింది. అయితే వాళ్ల పేర్లను వెల్లడించేందుకు మాత్రం అమెరికా ప్రతినిధి జాన్ కిర్బీ నిరాకరించారు. మాస్కోలో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయం దగ్గర ఓ దౌత్యవేత్తపై రష్యా పోలీస్ చేయి చేసుకున్నాడు. అయితే ఆ దౌత్యవేత్త అమెరికా నిఘా సంస్థ సీఐఏకు పనిచేస్తున్నట్లు రష్యా ఆరోపిస్తోంది. తన ఆధార పత్రాలను చూపించాలని కోరినప్పుడు అతను నిరాకరించాడని, దాంతో అతనిపై రష్యా పోలీస్ చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. జూన్ 6వ తేదీన ఆ ఘటన జరిగింది. అమెరికా దౌత్యవేత్త, రష్యా పోలీస్ మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియోను కూడా తాజాగా రిలీజ్ చేశారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com