ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ టెస్టింగ్ ను ఫేస్ బుక్ లో
- July 09, 2016
ఫేస్ బుక్ తన మెసెంజర్ యూజర్లకు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. ప్రస్తుతం తన మెసెంజర్ యాప్ లో డిజిటల్ సంభాషణలను హ్యాకింగ్ బారి నుంచి కాపాడటానికి ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ టెస్టింగ్ ను ఫేస్ బుక్ ప్రారంభించింది. 900మిలియన్ యూజర్లున్న ఈ మెసెంజర్ యాప్ కు లిమిటెడ్ గా టెస్టింగ్ ను ప్రారంభిస్తున్నట్టు శుక్రవారం ఫేస్ బుక్ వెల్లడించింది. మెసేజింగ్ లో ఎక్కువ ప్రాచుర్యం పొందిన తన వాట్సాప్ యాప్ కు మూడు నెలల క్రితమే ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ ప్రవేశపెట్టింది. 100 కోట్ల మంది యూజర్లున్న ఈ ఈ వాట్పాప్ యాప్ ను 2014లో ఫేస్ బుక్ సొంతంచేసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ ఎన్క్రిప్టెడ్ సంభాషణ యూజర్లు పంపించే వీడియోలకు, పేమెంట్లకు వర్తించదని ఫేస్ బుక్ తెలిపింది. వాట్సాప్ కు వాడిన ఎన్ క్రిప్షన్ టెక్నాలజీనే ఫేస్ బుక్ మెసెంజర్ యాప్ కూడా వాడనుంది. యూజర్ల ప్రమేయం లేకుండానే వాట్సాప్ మెసేజ్ లు ఎన్క్రిప్టెడ్ అవుతాయి. అదనపు భద్రతా రక్షణతో మెసెంజర్ యూజర్లకు ఈ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. అయితే ప్రస్తుతం ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ సర్వత్రా చర్చనీయాంశమైంది.
డిజిటల్ కమ్యూనికేషన్లో జరిగే ఈ గూఢచర్య సంభాషణలు చట్టాలకు సహకరించాలని ప్రభుత్వ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఫీచర్ వల్ల ఉగ్రవాద చర్యలు పెరిగే అవకాశముందంటున్నారు. కేవలం మెసేజ్ రాసేవారు, అవతల దాన్ని చూసుకునే వారికి మాత్రమే ఈ మెసేజ్‌లు కనిపిస్తాయి. దీంతో దీని ద్వారా చాట్ చేసే మెసేజ్‌లన్నీ పూర్తి భద్రంగా ఉంటాయి. యాపిల్ ఇంక్ ఐమెసేజింగ్ ప్లాట్ ఫాంలకు, లైన్, సిగ్నల్, వైబర్, టెలిగ్రాం వంటి ఇతర యాప్ లకు ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ ను ఆఫర్ చేస్తున్నాయి.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







