ఈనెల 19న శ‌బ‌రిమ‌ల‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

- May 05, 2025 , by Maagulf
ఈనెల 19న శ‌బ‌రిమ‌ల‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

న్యూ ఢిల్లీ: భారత రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు కేరళలో పర్యటించ‌నున్నారు.. ఈనెల‌ 18, 19 తేదీల్లో ఆమె ఆ రాష్ట్రంలో జ‌రిగే వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌నున్నారు. ఇక రాష్ట్రపతి 18న స్థానిక కళాశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి కొట్టాయం జిల్లాకు చేరుకుంటారు.ఆ మరుసటి రోజు, మే 19న ఆమె ఎడవం మాస పూజల ముగింపు రోజున ప్రార్థనలు చేయడానికి శబరిమల శ్రీ అయ్యప్ప ఆలయాన్ని సందర్శిస్తారు. రాష్ట్ర‌ప‌తిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర‌ప‌తి శ‌బ‌రిమ‌ల‌కు వెళ్లనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com