అట్టహాసంగా మొదలైన 'ఆటా' మహాసభలు
- July 09, 2016
అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ (ఆటా) మహా సభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అమెరికాలోని డెట్రాయిట్ నగరం వేదికగా ఇవాళ తొలి రోజు ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ మహా సభలకు పెద్ద ఎత్తున అమెరికాలోని తెలంగాణ ఎన్నారైలు తరలి వచ్చారు. తెలంగాణ నుంచి కూడా పలువురు నేతలు, కవులు, కళాకారులు హాజరయ్యారు. మొదటి రోజు వేడుకల్లో తెలంగాణ జానపద కళాకారులు ఆటాపాటలతో హోరెత్తించారు. తెలంగాణ సాంప్రదాయ నృత్యాలతో సభను అలరింపజేశారు. ఎంపీ జితేందర్ రెడ్డి కూడా వీరితో కలిసి స్టెప్పులు వేశారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, సీతారాం నాయక్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, సాంస్కృతిక రథ సారథి ఛైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సాంస్కృతిక సారథి బృందం సభ్యులు, యాంకర్ మంగ్లీ పాల్గొన్నారు.
తెలంగాణ అభివృద్ధిలో ఎన్నారైలు తమవంతు పాత్రను పోషించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలని కోరారు. తెలంగాణ అభివృద్ధి కోసం సూచనలు, సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నాటి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఎన్నారైల పాత్ర మరవలేదని కొనియాడారు.
తెలంగాణ అభివృద్ధిలో ఎన్నారైలు తమ వంతు పాత్రను పోషించాలని మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కోరారు. అమెరికాలో ఉన్న తెలంగాణవాసులంతా ఒకే వేదికపై కలుసుకునేలా ఏర్పాట్లు చేసిన ఆటా నిర్వాహకులను ఆయన అభినందించారు. మనకంటూ ఒక వేదికను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







