యూఏఈకి అనుకూలంగా తీర్పునిచ్చిన ప్రపంచ కోర్టు..!!
- May 06, 2025
యూఏఈ: డార్ఫర్ జోక్యంపై యూఏఈకి వ్యతిరేకంగా సూడాన్ దాఖలు చేసిన జాతి నిర్మూలన కేసును ప్రపంచ కోర్టు కొట్టివేసిందని ICJ సోమవారం ప్రకటించింది. ఈ విషయంపై తీర్పు చెప్పే అధికారం తమకు లేదని చెబుతూ, కేసును కొట్టివేసినట్లు అంతర్జాతీయ న్యాయస్థానం తెలిపింది.
అధికార పరిధి లేకపోవడం వల్ల కేసును కొట్టివేయాలన్న ICJ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు యూఏఈ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయం ఆధారంగా, కేసును కోర్టు రిజిస్ట్రీ నుండి తొలగిస్తారు. సంబంధిత అన్ని చర్యలు అధికారికంగా ముగుస్తాయి.
2023 నుండి సూడాన్ సైన్యంతో పోరాడుతున్న పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) కు ఆయుధాలను సరఫరా చేస్తోందని వాదిస్తూ, హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో సూడాన్ యూఏఈపై కేసు దాఖలు చేసింది. కాగా, తిరుగుబాటుదారులకు మద్దతు ఇస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను యూఏఈ ఖండించింది. వేలాది మందిని బలిగొన్న యుద్ధాన్ని ముగించే ప్రయత్నాల నుండి దృష్టి మరల్చే "రాజకీయ నాటకం"గా సూడాన్ కేసును తోసిపుచ్చింది.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







