గాంధీ మార్గంలో మోడీ
- July 09, 2016
ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం డర్బన్ వరకు రైలులో ప్రయాణించారు. దక్షిణాఫ్రికాలో నాడు మహాత్మాగాంధీ ప్రయాణించిన రైలు మార్గంలోనే నేడు మోదీ ప్రయాణించారు. పెంట్రిచ్ రైల్వే స్టేషన్ నుంచి పీటర్‌మారిట్జ్‌బర్గ్ వరకు పలువురు ఆఫ్రికన్ అధికారులతో మోదీ రైల్లో వెళ్లారు. 1893లో గాంధీజీ దక్షిణాఫ్రికాలో రైలులో ప్రయాణించినప్పుడు జాతివివక్ష కారణంగా రైల్లో నుంచి దించేసిన చారిత్రక ఘటన జ్ఞాపకార్థం మోదీ అదే మార్గంలో రైలులో ప్రయాణం చేశారు. రైల్లో నుంచి దించేసిన ఘటనే గాంధీని జాతివివక్షపై పోరాటం దిశగా నడిపించిన సంగతి తెలిసిందే.
ఆఫ్రికాలో నాలుగు దేశాల్లో పర్యటన నిమిత్తం వెళ్లిన మోదీ జొహన్నెస్‌బర్గ్ నుంచి ఈరోజు ఉదయం డర్బన్ చేరుకున్నారు. అంతకుముందే మోదీ దక్షిణాఫ్రికాలో భారత సంతతి వారితో సమావేశమయ్యారు. ఆ కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. దక్షిణాఫ్రికాను మహాత్మాగాంధీ భూమిగా అభివర్ణించారు. ఈ దేశమే మోహనదాస్ కరమ్‌చంద్ గాంధీని మహాత్మా గాంధీగా మార్చిందన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







