త్రివిధ ద‌ళాల‌తో ప్ర‌ధాని మోదీ భేటీ.. మ‌రోసారి హై లెవెల్ మీటింగ్ !

- May 08, 2025 , by Maagulf
త్రివిధ ద‌ళాల‌తో ప్ర‌ధాని మోదీ భేటీ.. మ‌రోసారి హై లెవెల్ మీటింగ్ !

న్యూ ఢిల్లీ: భార‌త్-పాక్ మ‌ధ్య యుద్ద వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ మ‌రోసారి ర‌క్ష‌ణ మంత్రిత్వ‌ శాఖ‌తో హైలెవెల్ మీటింగ్ నిర్వ‌హించారు. పాకిస్థాన్ నుంచి భారీ స్థాయిలో దాడులు జరిగినట్లు సమాచారం అందడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఘటనకు సంబంధించిన కీలక వివరాలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు.

ఈ సమాచారం అందిన వెంటనే, ప్రధానమంత్రి మోదీ తాజా పరిణామాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారని కేంద్ర వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అత్యున్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీడీఎస్, త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com